cloudfront

Advertisement


Home > Politics - Gossip

'దేశం' తొలి జాబితాలో ఆ కులం ఎక్కడ?

'దేశం' తొలి జాబితాలో ఆ కులం ఎక్కడ?

తెలుగుదేశం పార్టీ తన తొలిజాబితాను బయటకు విడదుల చేసింది. 126 సీట్లకు గాను అభ్యర్థులను ఖరారు చేసింది. దీనిపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగతిరుగుతోంది. ఎక్కడో కడప సీటు బిసిలకు ఇవ్వగలవా అని జగన్ ను నిలదీసిన పవన్ ఇప్పుడు ఈ తెలుగుదేశం జాబితాలో బ్రాహ్మణులకు ఒక్క సీటు కూడా ఎందుకు ఇవ్వలేదు అని అడగగలడా? అంటున్నారు.

తక్కువశాతం జనాభా వున్న కమ్మవారికి 32 సీట్లు, బిసిలకు 31 సీట్లు, బలిజ, తూర్పుకాపులకు 17 సీట్లు, ఎస్సీ సోదరులకు 18 సీట్లు, ముస్లింలకు రెండు సీట్లు ఇచ్చారని, బ్రాహ్మణులకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని లెక్కలు తీస్తున్నారు.

వైకాపా జాబితాలో రెడ్లకు పెద్ద పీట వుంటే వుండొచ్చు. కానీ బ్రాహ్మణులకు మొండిచేయి మాత్రం వుండదని అంటున్నారు. వైకాపాలో కనీసం ఇద్దరు బ్రాహ్మణులు (మల్లాదివిష్ణు, కోనరఘుపతి) వుండే అవకాశం క్లియర్ గా వుంది.

మొత్తంమీద మరోసారి తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ వ్యతిరేకత బయటపడిందని చెప్పే ఈ పోస్టు ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో తిరిగేస్తోంది.