cloudfront

Advertisement


Home > Politics - Gossip

'తమ్ముళ్ల'కు ఆర్థిక ఇబ్బందులు.. తోక పత్రిక కామెడీ

'తమ్ముళ్ల'కు ఆర్థిక ఇబ్బందులు.. తోక పత్రిక కామెడీ

ఫలితాలు వెలువడ్డానికి సరిగ్గా నెలరోజులు టైం ఉంది. ఓటమి ఖాయమని టీడీపీ ముందే ఫిక్స్ అయింది. అందుకే ఆ ఓటమికి రకరకాల కారణాల్ని సాకుగా చూపుతూ అను'కుల' మీడియాతో ఇప్పటికే కథనాల వంటకం ప్రారంభించింది. ఇందులో భాగంగా 30శాతం ఈవీఎంలు పనిచేయలేదంటూ బీద అరుపులు అరిచారు చంద్రబాబు. దానికి అతడి మీడియా భారీగా ప్రచారం చేసి పెట్టింది. కానీ ఆ పాచిక పారలేదు. అందుకే ఇప్పుడు కొత్తపల్లవి అందుకున్నారు.

రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే దానికి కారణం ప్రభుత్వ వైఫల్యం కాదట. ప్రతిపక్షం చేసిన ప్రలోభాలే కారణం అట. ఈ మేరకు చంద్రబాబు తోక పత్రిక ఒకటి రాసుకొచ్చిన కథనం జబర్దస్త్ కామెడీని షోని తలపిస్తోంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో 20 స్థానాల్లో కచ్చితంగా టీడీపీ వచ్చే అవకాశం ఉందట. కానీ అక్కడ 4 నెలల ముందు నుంచే ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిందట. డబ్బులు పంచిందట. అందుకే ఆ స్థానాలు టీడీపీ చేజారిపోయాయట.

ఇక్కడితో ఆగితే కేవలం దీన్నొక ఆరోపణగా తీసుకొని వదిలేయొచ్చు. కానీ సదరు తోక పత్రిక దీనికి కొనసాగింపు ఇచ్చింది. ఆ 20 స్థానాల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన నేతలు కడు పేదలట. డబ్బులు ఖర్చుపెట్టేంత ఆర్థిక స్తోమత వాళ్లకు లేదట. అందుకే వాళ్లు ఓడిపోబోతున్నారట. ఇది కదా అసలైన కామెడీ!

ఐదేళ్లు అధికారాన్ని అనుభవించిన టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఎలా దోచుకున్నారో అంతా చూశాం. ముఖ్యమంత్రి, మంత్రి స్థాయి నుంచి గల్లీనేత వరకు కోట్లలో అక్రమాస్తులు సంపాదించుకున్నారు. అంతెందుకు.. చివరికి మండలస్థాయి నేతలు కూడా 30-40 కోట్ల మేరకు సంపాదించుకున్నారని ప్రతి మండలంలో ప్రజలు చెప్పుకుంటున్నారు. అవినీతి ఈ స్థాయిలో జరిగితే, ఎన్నికల్లో ఖర్చుపెట్టడానికి డబ్బులు కూడా లేని స్థాయిలో టీడీపీ అభ్యర్థులు ఉన్నారట.

ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. సదరు 20 నియోజకవర్గాల్లో వైసీపీ 4 నెలల ముందు నుంచే వ్యూహాత్మకంగా నిధులు తరలించిందట. 4 నెలల ముందు నుంచే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిందట. అలాంటప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ యంత్రాంగం ఏం చేస్తోంది? నిజంగా అలాంటి అనుమానాలుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు కదా? కనీసం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు కదా? ఇలాంటివేం జరగలేదు.

కేవలం తమ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ఇలా తన తోక పత్రికతో అర్థంపర్థం లేని కథనాలు రాయిస్తున్నారు. ఓడినా ప్రజల సింపతీ తమపై ఉండేలా చూసుకుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ఎంత డబ్బు వెదజల్లాలో నియోజకవర్గంలో ఏ ఓటరును అడిగినా చెబుతారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు పచ్చ పార్టీ నేతలు ఎంత డబ్బు ఖర్చుపెట్టారో లెక్కలు తీస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఇవన్నీ వదిలేసి, నెపాన్ని వైసీపీపై నెట్టేలా కథనాలు పుట్టుకొస్తున్నాయి.

ఈ "జబర్దస్త్" ఎపిసోడ్ లో లాస్ట్ పంచ్ ఏంటంటే.. చాలామంది టీడీపీ అభ్యర్థులు కావాలనే డబ్బులు ఖర్చు పెట్టలేదట. ఎందుకంటే పసుపు-కుంకుమ పథకం తమకు గెలిపిస్తుందని వాళ్లకు నమ్మకం అంట. గడిచిన 4 రోజులుగా చంద్రబాబు అనుకూల మీడియా కథనాలు ఇలా సాగుతున్నాయి. ఇంతచేసి ఆ 20 స్థానాలు ఏంటనేది సదరు తోక పత్రిక చెప్పనేలేదు.

తెలుగుదేశంలోనూ విజయం మీద ఫుల్ కాన్ఫిడెన్స్!

నాని ఇంటర్వ్యూలో చెప్పినట్లు జెర్సీ సినిమా ఉందా?