cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఓటమి భయంతో రేవంత్‌ ఓవరాక్షన్‌.!

ఓటమి భయంతో రేవంత్‌ ఓవరాక్షన్‌.!

ఎన్నికల్లో గెలుపు కోసం ఏ రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి అయినా నానా తంటాలూ పడాల్సిన రోజులివి. ఈ క్రమంలో రాజకీయ నాయకుల అత్యుత్సాహం అత్యంత సర్వసాధారణమైపోయింది. ఎన్నికల్లో గెలుపు కోసం 'కోట్లు' పంచడం ఈ రోజుల్లో చాలా చిన్న విషయం. 'తనిఖీల్లో దొరికింది గోరంత, దొరకనిది కొండంత' అని గడచిన రెండు దశాబ్దాల్లో బయటపడ్డ నోట్లకట్టలు, బయటపడకుండా చేతులు మారిన నోట్లకట్టలు నిరూపించాయి.

ఇక, అసలు విషయానికొస్తే.. తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతల్లో ఒకరైన రేవంత్‌రెడ్డి పోటీచేస్తోన్న 'కొడంగల్‌' నియోజకవర్గం, తెలంగాణ ఎన్నికల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో ఇదే అత్యంత ఖరీదైన నియోజకవర్గంగా రికార్డులకెక్కుతోంది. రేవంత్‌రెడ్డిని ఓడించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి సర్వశక్తులూ ఒడ్డుతోంది. రేవంత్‌ తక్కువేమీకాదు.. ఆయనా తనవంతుగా కష్టపడుతున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు ఇరువైపుల నుంచీ జోరుగా సాగుతున్నాయి.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ప్రజాకూటమి అభ్యర్థి.. ఈ ఇద్దరూ చేస్తున్న ఖర్చుచూసి కొడంగల్‌ ప్రజానీకం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదిలావుంటే, కొడంగల్‌లో ఓటమిపై రేవంత్‌రెడ్డిలో అనుమానాలు బలపడుతున్నట్టున్నాయి. దాంతో, ఆయన 'యాగీ' మరింత ఎక్కువైంది. ఎన్నికల కోడ్‌ అమల్లో వుందని తెలిసీ, కొడంగల్‌ బంద్‌కి పిలుపునిచ్చేశాడాయన. అంతేనా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.

అధికారుల పేర్లు రాసిపెడుతున్నామనీ, తాము అధికారంలోకి వచ్చాక 'శంకరగిరి మాన్యాలు' పట్టిస్తామనీ ఇటు అధికారులకీ, అటు అధికార పార్టీ నేతలకీ హెచ్చరికలు జారీ చేసేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ గాలి గట్టిగా వీచిన 2014 ఎన్నికల్లోనూ రేవంత్‌రెడ్డి, టీడీపీ నుంచి విజయాన్ని అందుకున్న విషయం విదితమే. ఆ తర్వాత ఆయన టీడీపీలో కీలకనేతగా ఎదిగారు. అనూహ్యంగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి రావడం, ఆ తర్వాత కాంగ్రెస్‌ - టీడీపీ పొత్తు ఖరారవడం తెల్సిన విషయాలే.

టీడీపీ - కాంగ్రెస్‌.. వీటికి తోడుగా తెలంగాణ జనసమితి, సీపీఐ.. ఇలా తనకు బోల్డంత మద్దతు వుందని రేవంత్‌ భావిస్తున్నారు. ఇంకోపక్క, టీఆర్‌ఎస్‌ - మజ్లిస్‌లతో తెరవెనుకాల 'మైత్రి' నడుపుతున్న బీజేపీ కూడా, రేవంత్‌ ఓటమిని కాంక్షిస్తోంది. ఈ నేపథ్యంలో కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి గెలుపు అంతతేలిక కాదనే అభిప్రాయాలు గట్టిగా విన్పిస్తున్నాయి.

ఇంకేముంది, రేవంత్‌ తనదైన స్టయిల్లో పబ్లిసిటీ స్టంట్లకు తెరలేపారన్నమాట. ఇంతకీ, ఎన్నికల తనిఖీల్లో అధికార పార్టీకి చెందిన అభ్యర్థి బంధువులు అడ్డంగా బుక్కయిపోవడమేంటట.? దీనర్థం.. రేవంత్‌కి పరిస్థితులు అనుకూలంగా వున్నాయని కాదు, రేవంత్‌కి ఇదొక హెచ్చరిక.. ఎన్నికల్లోపు, రేవంత్‌కి చాలా పెద్ద ఝలక్‌ తగలబోతోందనేనేమో.!

ఆ పార్టీకి మినిమం మెజారిటీ గ్యారెంటీ!... ఎందుకో తెలుసా?