cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఓవర్‌ నైట్‌ నేతలతో వైకాపాకు చేటు..!

ఓవర్‌ నైట్‌ నేతలతో వైకాపాకు చేటు..!

ఓవర్‌ నైట్‌ పుట్టుకొస్తున్న కొందరు నేతలతో కొంపమునిగే దుస్థితి వాటిల్లుతోందని వైకాపా శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి. కొంతమంది ఇంటి దొంగలతో జగన్‌ పార్టీకి చేటు కలిగే పరిస్థితి దాపురించిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఎన్నిక కావల్సినవారు కేవలం ఆయా రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులకు నచ్చినవారే కాకుండా ప్రజలు మెచ్చే వారయ్యుండాలన్నది ప్రాథమిక సూత్రం! అయితే ప్రజలతో సంబంధం లేనప్పటికీ, పార్టీలలోని నిర్ణయాత్మక శక్తులను ఎదోవిధంగా ప్రసన్నం చేసుకుని, తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న వారు వైకాపాలో తయారయ్యారు.

అటువంటి ఓవర్‌ నైట్‌ నాయకులు ఎక్కువగా కొత్తగా ఊపిరి పోసుకున్న పార్టీల్లోనే కనిపించడం సహజం! అయితే వైకాపా ఆవిర్భవించి ఎనిమిదేళ్ళు దాటినా ఈ తరహా పోకడలు కనిపిస్తుండటం పార్టీకి చేటు తెచ్చేవిగా మారాయి. తూర్పుగోదావరి జిల్లాలోని అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా బీసీవర్గాల నుండి ఈ విధంగా కొత్త ముఖాలు పుట్టుకురావడంతో పార్టీ ప్రారంభం నుండి ఉన్న నాయకులకు శిరోభారంగా మారింది. ఈ కారణాలతో పార్టీ శ్రేణులూ డీలా పడుతున్నాయి. సాధారణంగా ఈ తరహా కొత్త నాయకులకు ప్రజలతో పంతమాత్రం సంబంధముండదనే నిర్వివాదాంశం!

కిందిస్థాయి కార్యకర్తలతో కూడా వీరికి సన్నిహిత సంబంధాలుండవు! అటువంటి అభ్యర్ధుల పట్ల విధేయత, శ్రద్ధతో పార్టీ కేడర్‌ పని చేయకపోవడంతో జనంలో ఉండే ఆదరణను ఓట్ల రూపంలో పొందలేక పార్టీ పరాజయం పాలుకా తప్పదు! పార్టీ సర్వేలలో సదరు నేతలు ఆధిక్యత చాటుకున్నా ఇటువంటి స్థానిక అంశాల కారణంగా చతికిలపడటం 2014 ఎన్నికల్లో పార్టీ చవిచూసింది! నిజానికి 2014లో గెలిచే అవకాశాల్లేవని తెలిసినప్పటికీ కొందరు సీనియర్‌ నాయకులకు వివిధ మొహమాటాలు, ఒత్తిళ్ళ కారణంగా జగన్‌ అవకాశం కల్పించారు. ఇటువంటి గుదిబండల కారణంగా పార్టీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

జిల్లాలోని రామచంద్రపురం, మండపేట తదితర నియోజకవర్గాల్లో ఇటువంటి పరిస్థితులు దాపురించినట్టు శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో కన్వీనర్‌ల పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో నాయకత్వ మార్పిడి తథ్యమన్న ప్రచారం జరుగుతోంది. ఇదే అదనుగా ఓ మహిళ గతంలో పార్టీతో ఏ విధమైన సంబంధం లేనప్పటికీ టిక్కెట్‌ కోసం తెరచాటు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. జగన్‌కు సన్నిహితుడైన ఓ వ్యక్తి ద్వారా టిక్కెట్‌ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం!

వైకాపా ఆవిర్భావం నుండి రామచంద్రపురం నియోజకవర్గంలో పార్టీ కోసం పంతో కృషిచేసిన ఓ డాక్టర్‌ దంపతులకు దక్కాల్సిన గౌరవం దక్కకుండా చేయడంలో స్థానిక పమ్మెల్సీ, కో-ఆర్డినేటర్లు శాయశక్తులా కృషి చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ జగన్‌ విజ్ఞతతో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారన్న ఆశాభావంతో స్థానిక కేడర్‌ ఉంది. మండపేట నియోజకవర్గానికి పార్టీ బాధ్యుడిగా నియమితులైన పితాని అన్నవరంపై స్థానికేతరుడన్న ముద్ర ఉంది.

మండపేటలో కమ్మ సామాజికవర్గానికి తిరుగులేని పట్టున్నప్పటికీ వేరే సామాజికవర్గానికి చెందిన అన్నవరం స్థానికేతరుడు కూడా కావడంతో ఇక్కడ వైకాపాకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. గతంలో గిరజాల వెంకటస్వామినాయుడు ఇదే విధంగా స్థానికేతరుడు, కాపు సామాజికవర్గానికి చెందిన వారన్న కారణాలతో మండపేట నుండి పోటీచేసి పరాజయం పాలయ్యారు. రాజకీయాలకు కొత్త, స్థానికేతరుడైన అన్నవరం సైతం అదేరీతిలో దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

రాజకీయంలో డబ్బే డబ్బు.. ఇదే రాజకీయ సిద్ధాంతం..!

వైఎస్సార్ డైలాగ్స్ పబ్లిక్ చెప్తే.. ఆ కిక్కే వేరప్పా