cloudfront

Advertisement


Home > Politics - Gossip

పచ్చ కోటలు బీటలు వారుతున్నాయా..?!

పచ్చ కోటలు బీటలు వారుతున్నాయా..?!

రాయలసీమలో తెలుగుదేశం పార్టీ మూడు జిల్లాల్లో బలహీనంగానే కనిపిస్తోంది. గత ఎన్నికలతోనే ఆ విషయం స్పష్టం అయ్యింది. ఇక ఆ ఎన్నికలు అయిన తర్వాత రాయలసీమను చంద్రబాబు నాయుడుపూర్తిగా నిర్లక్యం చేశారు కూడా. రాయలసీమకు దక్కాల్సిన మినిమం ప్రయోజనాలను కూడా బాబు దక్కనీయలేదు. సీమాంధ్ర సహిత రాష్ట్రంలో రాజధాని రాయలసీమకు దక్కాలి. అయితే బాబు తన ఇష్టానికి రాజధానిని తీసుకెళ్లారు. కనీసం ఆ ప్రాంతమైన రాయలసీమకు దగ్గరా? రోడ్డు సౌకర్యం ఉందా, రైలు సౌకర్యం ఉందా.. అంటే ఏవీ సవ్యంగా లేవు!

రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ఎక్కడ నుంచి అయినా అమరావతి ప్రాంతానికి చేరుకోవడం అత్యంత కష్టమైన అంశం. కాబట్టి ఏ విధంగానూ రాజధాని ప్రాంతంతో రాయలసీమ ప్రజలకు సంబంధాలు ఏర్పడటం లేదు. కేవలం తెలుగుదేశం కమ్మనేతలు రాజధాని ప్రాంతంలో భారీగా భూములు కొనుగోలు చేసుకోవడం తప్ప.. అంతకు మించి రాజధానితో ఎలాంటి బాండేజీ కనిపించడం లేదు రాయలసీమ ప్రజలకు.

ఇక రాయలసీమకు కనీసం హైకోర్టును అయినా దక్కనిచ్చారా? అంటే అదీలేదు. ఇక ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన ఇంకో ప్రహసనం. ఇక హంద్రీనీవా పేరు చెప్పుకుంటున్నారు. దాని క్రెడిట్‌ పూర్తిగా వైఎస్‌కే దక్కుతుందని సీమ ప్రజలకు చెప్పనక్కర్లేదు. కియా పరిశ్రమ వచ్చింది కూడా కేవలం హంద్రీనీవా మీద ఆధారపడి మాత్రమే! నాలుగున్నరేళ్లలో బాబు చేసింది ఏమిటంటే.. వైఎస్‌ హయాంలో నిర్మితమైన హంద్రీనీవాతో నీళ్లు వస్తే.. చెరువులకు హారతులు ఇవ్వడం. ఇదీ బాబు చేసినపని.

ఇక రాజకీయంగా సీమలో బలపడటానికి బాబు ఫిరాయింపులను ఎడాపెడా ప్రోత్సహించారు. ఇంకా ఎవరైనా వస్తారా.. అని చూస్తున్నారు. తీరా ఇప్పుడు ఫిరాయింపుదారులకు టికెట్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇదీ స్థూలంగా కథ. మరోవైపు తెలుగుదేశం పార్టీ పాత కోటలకు ఇప్పుడు బీటలు వారుతున్నాయి. రకరకాల రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో తన కంచుకోటల్లో పట్టు నిలపుకుంటుందా? అనేది చర్చనీయాంశంగా మారుతోంది.

ప్రధానంగా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో తన పట్టును చూపించుకుంది. అందులో.. ముఖ్యమైనవి అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాలు. ప్రధానంగా హిందూపురం పార్లమెంట్‌ సీటు పరిధిలోని సీట్లు. హిందూపురం, పెనుకొండ, రాప్తాడు.. అసెంబ్లీ సీట్లను తెలుగుదేశం వరసగా మరోసారి సొంతం చేసుకుంది. ధర్మవరం వంటి సీట్లో నెగ్గినా.. అది టీడీపీ కంచుకోట కాదు. ఒక్కోసారి ఒక్కోరికి అవకాశం ఇస్తూ ఉంటుంది ధర్మవరం.

టీడీపీకి కంచుకోటలు అంటే.. హిందూపురం, పెనుకొండ, రాప్తాడులను చెప్పాలి అనంతపురం జిల్లాలో. ఈ మూడు సెగ్మెంట్లు ఇచ్చే బలం.. ఇతర సమీకరణాలతో హిందూపురం ఎంపీ సీటను కూడా తెలుగుదేశం సునాయాసంగా గెలుస్తూ ఉంటుంది. అయితే ఈసారి టీడీపీ కోటలకు బీటలు వారే పరిణామాలు కనిపిస్తున్నాయి. ముందుగా రాప్తాడు ఈ వరసలో ఉంది. ఇక్కడ మంత్రి పరిటాల సునీతకు పూర్తిగా ఎదురుగాలి వీస్తోంది. గత ఎన్నికల్లోనే ఆఖర్లో వ్యవహరించిన తీరుతో సునీత సేఫ్‌ అయ్యారు. అయితే ఈమధ్య కాలంలోనే పరిటాల సునీత అనుచరులు చాలామంది ఆమెకు దూరం అయ్యారు.

జగన్‌ పాదయాత్ర దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఊపు గట్టిగా కనిపిస్తోంది. రాప్తాడు నియోజకవర్గం పరిధిలో రెండుచోట్ల జగన్‌ సభలు జరిగితే.. రెండుచోట్లా బ్రహ్మాండమైన రెస్సాన్స్‌ వచ్చింది. గత ఎన్నికల్లో సునీత నెగ్గడానికి ప్రధాన కారణాల్లో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వంటి హామీలు ముఖ్యమైనవి. ఇప్పుడు అలాంటి ఫ్యాక్టర్లు తెలుగుదేశానికి అనుకూలంగా లేవు. మరోవైపు పాలనకాలంలో సునీత నియోజకవర్గంలో బాగా వ్యతిరేకతను పెంచుకున్నారు.

సునీత వద్దకు సామాన్యులు వెళ్లే ప్రసక్తిలేదు. ఎవరో రౌడీయిజం బాగా చేయగలిగే వాళ్లు, రౌడీ షీటర్లు, కమ్మ కులస్తులు తప్ప.. ఆమె దరిదాపుల్లోకి కూడా మిగతావాళ్లు వెళ్లలేరు. బీసీలు ఇప్పటికే ఇలాంటి నియోజకవర్గంలో టీడీపీకి చాలాదూరం అయ్యారు. గత ఎన్నికల్లోనే ఆ విషయం స్పష్టం అయ్యింది. హామీల మూలంగా నెగ్గుకురావడమే జరిగిందప్పుడు. అయితే ఈసారి కథ పూర్తిగా మారిపోయేలా ఉంది. రాప్తాడులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగిరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇది మరీ అంత ఆశ్చర్యకరమైన పరిణామం ఏమీకాబోదని ముందే చెప్పడం జరుగుతోంది.

ఇక టీడీపీకి మరో పెట్టనికోట పెనుకొండ. ఇక్కడా బీసీ ఓటు బ్యాంకు గతంలో టీడీపీకే ధారాదత్తం అయ్యేది. అయితే గత ఎన్నికల్లో సమీకరణాలు మారాయి. పెనుకొండలో కూడా టీడీపీని హామీలే రక్షించాయి. ఇక హిందూపురం ఏమైనా సంచలన ఫలితాన్ని ఇస్తుందా? అనేది కూడా చర్చనీయాంశం అవుతోంది. వచ్చేసారి బాలకృష్ణ మళ్లీ ఇక్కడ నుంచి పోటీచేస్తే.. ప్రజలు గత ఎన్నికల్లాగా సినీమాయలో ఓటు వేయరని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. సినీగ్లామర్‌ ఒకసారి ఎన్నికల్లో గెలిపించవచ్చు. రెండోసారికి ప్రజల్లో కూడా మోజు మోకాళ్లకు దిగి ఉంటుంది.

ఇక ఎమ్మెల్యేగా బాలయ్య ఐదారు నెలలకు ఒకసారి హిందూపురం వచ్చి సర్కస్‌ ఫీట్లు చేయడం తప్ప ఉద్ధరించింది శూన్యం. ఇక ముస్లిం అభ్యర్థిని బరిలోకి దించుతోంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. గత ఎన్నికల్లో స్థానిక తెలుగుదేశం నేతల సహకారంతోనే బాలయ్య నెగ్గగలిగారు. ఈసారి లోటు కూడా కనిపిస్తోంది. ఏదేమైనా.. కంచుకోటల్లో తెలుగుదేశం పార్టీకి ఈసారి విజయం నల్లేరు మీద నడక అయితేకాదు!

రాజకీయంలో డబ్బే డబ్బు.. ఇదే రాజకీయ సిద్ధాంతం..!

వైఎస్సార్ డైలాగ్స్ పబ్లిక్ చెప్తే.. ఆ కిక్కే వేరప్పా