Advertisement

Advertisement


Home > Politics - Gossip

పల్లకీ మోసే వారి జాబితా

పల్లకీ మోసే వారి జాబితా

మొత్తానికి ఏడాదికి పైగా టైమ్ తీసుకున్న తరువాత తెలుగుదేశం పార్టీలో కదలిక ప్రారంభమైంది. అధినేత చంద్రబాబు ఇన్నాళ్లకు తీరిక చేసుకుని, పార్టీని ముందుకు నడిపించడానికి నాయకులను ఎంపిక చేసుకున్నారు. 

మూడున్నరేళ్ల పాటు పార్టీనికి జిల్లాల్లో, ప్రాంతాల్లో నడిపించడం అన్నది సామాన్య విషయం కాదు. శ్రమతో, ఖర్చు తో కూడుకున్నది. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలియంది కాదు. పైగా కడుపునిండిన జనాలు ఈ పనికి ముందుకు రారు. 

ముఖ్యంగా అయిదేళ్ల పాటు ఎవరైతే సంపాదించుకున్నారో, వారు ఇఫ్పుడు కామ్ గా వుంటారు. ఇప్పుడు పని చేసే వాళ్లు కావాలంటే, ఇన్నాళ్లు అవకాశం చూస్తున్న వాళ్లు అయి వుండాలి. ఇప్పటి నుంచి పని చేస్తే వచ్చే ఎన్నికల నాటికి అవకాశం వస్తుందని ఆశపడేవారై వుండాలి. అదే సమయంలో కుల సమీకరణలు వుండనే వుంటాయి.

ఈసారి జాబితా ను కూర్చడంలో చంద్రబాబు తీసుకున్న కీలకమైన జాగ్రత్త ఏమిటంటే తెలుగుదేశం వల్ల అధికంగా లబ్దిపొందే సామాజిక వర్గాన్ని వీలయినంత దూరంగా పెట్టడం. అంతా బిసిలు, కాపులు, ఎస్సీ ఎస్టీలపై దృష్టి పెట్టారు. చూసిన వాళ్లు అబ్బా...బాబు ఎంత ఔదార్యంతో పదవులు ఇచ్చారు అని అనుకోవడానికి.  కానీ ఇక్కడ అసలు విషయం వేరు. 

ఇప్పడు కూడా తెలుగుదేశం పార్టీ అండతో వ్యాపారాలు సాగించుకునే సామాజిక వర్గానికే పదవులు కట్టబెడితే ఇక అంతకన్నా ఆత్మహత్యాసదృశ్యం ఇంకోటి వుండదు. అలాగే ఇక్కడ ఇంకో సమస్య వుంది. ఈ సామాజిక వర్గ జనాలు పల్లకీ మోయడానికన్నా, పల్లకీలో కూర్చోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

అందువల్ల ఇప్పుడు కూడా వీళ్లకే అవకాశం ఇస్తే పార్టీ ఎక్కడ వున్నది అక్కడే వుంటుంది. అదే కనుక బిసి, కాపు, ఇతర కులాలను తెలివిగా వాడేసుకుని, మూడున్నరేళ్ల తరువాత అధికారం అందుకుంటే అప్పుడు పదవుల్లో మళ్లీ 'మనవాళ్లే' ముందుంటారు. వాళ్లకే మనం కూడా తాంబూలం అదించవచ్చు. ఎన్నికల వేళ వరకు ఈ బోయీలతో ఇలా ప్రయాణం సాఫీగా సాగించేవచ్చు.

ఇలా ఎందుకు నెగిటివ్ గా థింక్ చేయడం అని ఎవరైనా అనవచ్చు. సరే, బాబుగారు ఓ హామీ ఇవ్వవచ్చు కదా. ఎవరైతే ఇప్పుడు పార్లమెంటరీ స్థానాల్లో పదవులు పొందారో వారికే వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ లు అని ధైర్యంగా, బాహాటంగా ప్రకటించవచ్చు కదా? అప్పుడు వారు మరింత కష్టపడి పార్టీని బలోపేత చేస్తారు. అబ్బే..అలా మాత్రం ప్రకటించరు. 

ఓ పక్క కొన్నాళ్ల పాటు కాపులను దగ్గరకు తీసుకోవాలని చూసారు. కానీ అది ఇక సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చేసినట్లుంది ఇప్పుడు బిసిలకు పెద్ద పీట అంటున్నారు. రాజకీయాల్లో అనుభవం పండిన వారికి తెలుసు.

అధికారంలో లేనపుడు వచ్చే ఇలాంటి పదవుల వల్ల ఉపయోగం వుండదని, ఎన్నికల ముందు టికెట్ లు రావడానికి, దీనికీ ఎలాంటి సంబంధం వుండదని. అందుకే ఈ పదవులు అందుకున్నవారు ఫుల్ హ్యాపీగానూ లేరు. అందని వారు దిగాలుగానూ లేరు. ఎందుకంటే వారికి రాజకీయాలు తెలుసుకదా?

'జ్యోతి' ఆర్కే అయోమయపు రాతలు

విశాఖ‌కే అన్ని కావాలంటున్న విజ‌య‌సాయిరెడ్డి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?