Advertisement

Advertisement


Home > Politics - Gossip

ప‌నబాక పోటీలో ఉన్నాట్టా? లేన‌ట్టా!

ప‌నబాక పోటీలో ఉన్నాట్టా?  లేన‌ట్టా!

తిరుప‌తి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక విష‌యంలో.. తెలుగుదేశం అభ్య‌ర్థి ప‌నబాక ల‌క్ష్మి పోటీలో ఉన్న‌ట్టా?  లేన‌ట్టా? అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన చ‌ర్చ‌గా మారింది. చాలా ముందుగానే ప‌నబాక ల‌క్ష్మి పేరును అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు. ఉప ఎన్నిక‌కు సంబంధించి ఎలాంటి స‌ద్దూ లేన‌ప్పుడే ఆయ‌న అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేశారు.

అది కూడా వ్యూహాత్మ‌కంగా చేశార‌ని, టీడీపీని వీడిపోతున్న త‌రుణంలో ప‌న‌బాక‌కు ఆ అవ‌కాశం ఇచ్చి, ఆమె పార్టీ వీడ‌కుండా చూసుకున్నార‌నే గాసిప్స్ అప్ప‌ట్లోనే వినిపించాయి. తిరుప‌తి లోక్ స‌భ సీట్లో తెలుగుదేశం పార్టీ ట్రాక్ రికార్డు చాలా చెత్త‌గా ఉంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అయితే టీడీపీకి అక్క‌డ గెలుపు అవ‌కాశాలు జీరో. అలాంటి ప‌రిస్థితుల్లో ప‌న‌బాక‌ను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. ఆ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించి ఆమె అప్ప‌ట్లోనే వెనుక‌డుగు వేయ‌గా.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి వెళ్లి ఆమెకు ధైర్య‌వ‌చ‌నాలు ప‌లికార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి.

అప్పుడే అనుకుంటే.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో, పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఫ‌లితాల‌తో టీడీపీ త‌ర‌ఫున ఎవ‌రు పోటీ చేయాల‌న్నా .. భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చిన‌ట్టుంది! ప‌న‌బాకే కాదు.. మ‌రెవ‌రు అయినా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేయ‌డానికి సాహ‌సించే అవ‌కాశాలు లేవు. తిరుప‌తి కార్పొరేష‌న్ ప‌రిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపాదించుకున్న ఓట్ల‌లో క‌నీసం స‌గం స్థాయి ఓట్ల‌ను కూడా టీడీపీ అభ్య‌ర్థులు పొంద‌లేక‌పోయారు!

తిరుప‌తి అర్బ‌న్ లోనే అలాంటి ప‌రిస్థితి ఉందంటే.. గ్రామీణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి ఏమిటో చెప్ప‌న‌క్క‌ర్లేదు. సామాజిక స‌మీక‌ర‌ణాలు తిరుప‌తి అర్భ‌న్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు అంత అనుకూలంగా ఉండ‌వు. అయినా అక్క‌డే.. ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 

అలాంటిది ఈ లోక్ స‌భ సీటు ప‌రిధిలోని గ్రామీణ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ హ‌వా టీడీపీని భ‌య‌భ్రాంతుల‌కు లోనుచేసే అవ‌కాశం ఉంది. టీడీపీకి ఓట‌మి ఖాయ‌మే. అది ప‌న‌బాక ల‌క్ష్మికి కూడా ముందే తెలిసి ఉండొచ్చు. కానీ ఇప్పటి లెక్క‌ల్లోకి వ‌స్తే..టీడీపీ అభ్య‌ర్థి అదెవ‌రైనా చిత్తుగా ఓడిపోయిన రికార్డు ద‌క్కేలా ఉంది.

ఇక ప‌న‌బాక ల‌క్ష్మి క్యాడ‌ర్ తో అందుబాటులోకి అదిగో వ‌స్తున్నారు.. ఇదిగో వ‌స్తున్నారు.. అంటూ టీడీపీ హ‌డావుడి చేస్తూ ఉంది. ఇంట్లో శుభ‌కార్యంలో ఆమె బిజీ అని మొద‌ట అన్నారు. ఆ త‌ర్వాత జ‌న‌వ‌రి నుంచి అన్నారు, సంక్రాంతి త‌ర్వాత అంటూ ప్ర‌చారం చేశారు. తీరా షెడ్యూల్ విడుద‌ల త‌ర్వాత కూడా ఆమె అదే అనాస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. ఈ నేప‌థ్యంలో ఇంత‌కీ ప‌నబాక పోటీ చేస్తారా?  లేక పూర్తిగా త‌ప్పుకుంటారా? అనేది ఆస‌క్తిదాయ‌క అంశంగా మారింది.

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు

అల్లు అర్జున్ కి నేను పిచ్చ ఫ్యాన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?