cloudfront

Advertisement


Home > Politics - Gossip

పందాల ట్రెండ్ కోసం జనాల వెయిటింగ్

పందాల ట్రెండ్ కోసం జనాల వెయిటింగ్

ఆంధ్రలో ఎవరు గెలుస్తారు? మహిళలు ఎక్కువగా ఓట్లు వేసారు కాబట్టి తెలుగుదేశం గెలుస్తుందా? వీటన్నింటికీ మీడియా జనాలు, 'సర్వే'శ్వరులు కాదు సమాధానం చెప్పగలిగింది. బెట్టింగ్ బాబులు. అవును ఆంధ్రలో కాదు, తెలంగాణలో కాదు ఫలితాలను సరిగ్గా అంచనా వేసేది భీమవరం బెట్టింగ్ బాబులే. 

వాళ్ల బెట్టింగ్ ట్రెండ్ రోజు రోజుకు మారుతుంటుంది. పోలింగ్ కు ముందు జగన్ పార్టీకి 92 సీట్లు, బాబుగారి పార్టీకి 88 సీట్లు అంటూ బెట్టింగ్ నడిచింది.మరి ఫోలింగ్ తరువాత సంగతేమిటి? కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం భీమవరం బెట్టింగ్ వీరులు ఇంకా బెట్టంగ్ ఓపెన్ చేయలేదు.

చాలామంది బెట్టింగ్ కాసేవాళ్లు, వాళ్ల సమాచారం మీద ఆసక్తి వున్నవాళ్లు అదేపనిగా అందుకోసమే వెయిట్ చేస్తున్నారు. బెట్టింగ్ ఓపెన్ అయితే ఎన్నికల ఫలితాల మీద ఓ అంచనా వస్తుంది. అసలే కౌంటింగ్ కు ఇంకా చాలాదూరం వుంది కాబట్టి, జనాలకు మిగిలిన సోర్స్ ఇదే. అందుకే బెట్టింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని చూస్తున్నారు చాలామంది ఆ వ్యవహారంతో పరిచయం వున్నవారు.