cloudfront

Advertisement


Home > Politics - Gossip

పరిటాల శ్రీరామ్‌... కేసులే అర్హతలా!

పరిటాల శ్రీరామ్‌... కేసులే అర్హతలా!

పెనుగొండ పరిసరాల్లో.. రాప్తాడు నియోజకవర్గం పరిధిలో మళ్లీ పాత పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. గతంలో వందలాది మంది కాంగ్రెస్‌ పార్టీ కార్యర్తలు ఊచకోత కోయబడిన ప్రాంతం ఇది. కాంగ్రెస్‌ పార్టీ పేరుఎత్తిన వాళ్లపై దాడులు మామూలుగా ఉండేవి కావు. పరిటాల రవి హయాంలో ఆ అరాజకకాండ కొనసాగింది. ఆఖరికి 2004 ఎన్నికల పోలింగ్‌ రోజున కూడా పెనుగొండలో కాంగ్రెస్‌ ఏజెంట్లను పట్టుకుని కొట్టి రైలు పట్టాల మీద పడేసిన దాఖలాలు ఉన్నాయి. తీరా ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాకా ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.

పులిస్వారీ చేయడం అంటే అదే పులికి బలి కావడానికి రెడీగా ఉండాల్సినంతటి దోషం. పరిటాల హయాం ముగిశాకా.. పెనుగొండ పరిసర ప్రాంతాల్లో కాస్తరాజకీయ స్వేచ్ఛ లభించింది. అందుకే 2009 ఎన్నికల్లో పరిటాల సునీత రాప్తాడు నుంచి కేవలం 1,700 చిల్లర ఓట్ల తేడాతో బయటపడాల్సి వచ్చింది. అక్కడికీ కాంగ్రెస్‌ అభ్యర్థికి పోటీగా మద్దెల చెరువు సూరి రెబెల్‌ను నిలబెట్టడంతో.. తోపుదుర్తి కుటంబానికి వ్యతిరేకంగా సూరి మరో అభ్యర్థిని నిలబెట్టడంతో అతడు ఐదారువేల ఓట్లను పొందడంతో పరిటాల సునీత విజయం సాధ్యం అయ్యింది.

ఇక 2014కు వచ్చేసరికి మళ్లీ మామూలే. ఇక ఇప్పుడు పరిస్థితులు మరింత క్షీణిస్తున్నాయి. ఇప్పుడు రాప్తాడు పరిధిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై, వైసీపీ సానుభూతి పరులుపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఒకటీ రెండు హత్యలు కూడా జరిగాయి. తాజాగా పరిటాల శ్రీరామ్‌ వైకాపా సానుభూతి పరులును బెదిరించిన వ్యవహారంలో పోలీసులు కేసును పెట్టడానికి ముందుకు రాలేదు. దీంతో బాధితుడు హైకోర్టు వరకూ వెళ్లాడు. శ్రీరామ్‌పై కేసులు నమోదు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది.

ఈ విధంగా తండ్రి తీరును గుర్తు చేస్తున్నాడు పరిటాల శ్రీరామ్‌. వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేసేయాలని అనుకుంటున్న పరిటాల శ్రీరామ్‌ కేసులే అర్హతలు అనుకుంటున్నాడేమో!