Advertisement

Advertisement


Home > Politics - Gossip

మునుగోడు.. ఇరు వ‌ర్గాల్లోనే అదే డౌట్!

మునుగోడు.. ఇరు వ‌ర్గాల్లోనే అదే డౌట్!

మునుగోడు ఉప ఎన్నిక స‌మ‌రం విష‌యంలో ప్ర‌ధానంగా పోటీలో ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌మితి, భార‌తీయ జ‌న‌తా పార్టీల్లో ప్ర‌ధానంగా ఒక సందేహ‌మే వ్య‌క్తం అవుతున్న‌ట్టుంది!  *గెలుస్తామా..* అనేదే ఆ సందేహం! పైకి ఎన్ని మాటలు చెబుతూ ఉన్నా, ఏ స్థాయిలో ఆత్మ‌విశ్వాసం వ్య‌క్తం చేస్తూ ఉన్నా.. తమ అభ్య‌ర్థి గెలుస్తాడా? లేదా! అనేది ఇరు పార్టీల నుంచి వ్య‌క్తం అవుతున్న అంత‌ర్గ‌త సందేహం! 

ఈ ఉప ఎన్నిక పోటాపోటీగా ఉండ‌టంలో ఆశ్చ‌ర్యం లేదు. ఇరు వ‌ర్గాలూ భారీ ఎత్తున ఖ‌ర్చు పెడుతూ ఉన్నాయి. ప్ర‌చారాన్ని ఒక రేంజ్ లో చేప‌ట్టాయి. అంతా పూర్తై ఇక పోలింగే మిగిలింది. ఇలాంటి స‌మ‌యంలో.. పార్టీల కార్య‌క‌ర్త‌ల‌ను క‌దిలిస్తే.. విజ‌యం ప‌ట్ల మొద‌టేమో ధీమాగా చెబుతున్నారు. అటు టీఆర్ఎస్ వాళ్లూ, ఇటు బీజేపీ వాళ్లు.. ఇరు వ‌ర్గాలూ తాము గెలుస్తామ‌ని అంటున్నారు. అయితే కాసేపు తాపీగా మాట్లాడితే, ప‌రిస్థితి ఏమిటంటే.. మాత్రం వారు కొంత అభ‌ద్ర‌తాభావంలోకి ప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం!

టీఆర్ఎస్ కే కాస్త ఎడ్జ్ ఉండ‌వ‌చ్చంటూ బీజేపీ వాళ్లు, బీజేపీకే కాస్త ఎడ్జ్ ఉందేమో అంటూ టీఆర్ఎస్ వాళ్లు ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నారు! ఇరు వ‌ర్గాల్ల‌నూ అచ్చం ఇలాంటి అభిప్రాయాలే వ్య‌క్తం అవుతుండ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌చారం చివ‌రి వారంలో టీఆర్ఎస్ పుంజుకుంద‌ని బీజేపీ వాళ్లు చెబుతున్నారు. అదే టీఆర్ఎస్ వాళ్లేమో.. బీజేపీ బాగా పంచుతూ ఆఖ‌ర్లో పుంజుకుంద‌ని అంటున్నారు. ఆఫ్ ద రికార్డుగా ఇరు వ‌ర్గాల్లోనూ త‌మ ప్ర‌త్య‌ర్థికే కాస్త సానుకూల‌త ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. 

అయితే ఎవ‌రు గెలిచినా.. రెండు మూడు వేల ఓట్ల తేడానే అని మాత్రం రెండు వ‌ర్గాల నుంచి గ‌ట్టిగా వినిపిస్తున్న అభిప్రాయం. మేనేజ‌బుల్ మార్జిన్ తోనే ఎవ‌రైనా గెలుస్తారు త‌ప్ప‌.. ఏక‌ప‌క్షంగా ఫ‌లితాలు ఉండ‌వ‌ని పార్టీల నేత‌లు అంటున్నారు. తాము గెలిచినా, త‌మ ప్ర‌త్య‌ర్థి గెలిచినా రెండు మూడు వేల ఓట్ల మెజారిటీనే అని ఇందులో మాత్రం పెద్ద సందేహం లేద‌ని వారు అంటున్నారు.

ఆ రెండు మూడు వేల మెజారిటీ త‌మ‌కే ద‌క్కుతుంద‌ని మాత్రం వీరిలో విశ్వాసం లేదు! అచ్చంగా ఇరు వ‌ర్గాల‌దీ ఇదే ప‌రిస్థితి. ప్ర‌త్య‌ర్థే కాస్త పుంజుకున్న‌ట్టుగా ఇరు వ‌ర్గాలూ చెబుతున్నాయి. మ‌రి ఇరు వ‌ర్గాల్లోనూ విజ‌యం ప‌ట్ల విశ్వాసం లేని ఈ ప‌రిస్థితుల్లో గెలుపు వీరితో దోబూచులాడుతోంద‌ని అనుకోవాల్సి వ‌స్తోంది. మ‌రి ఇంత‌కీ గెలిచేదెవ‌రో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?