cloudfront

Advertisement


Home > Politics - Gossip

పవన్, కమ్యూనిస్టుల సీట్ల డీల్ ఇదే!

పవన్, కమ్యూనిస్టుల సీట్ల డీల్ ఇదే!

తమ పార్టీ 175 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిరోజూ స్పష్టం చేస్తూ వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు పొత్తు పిలుపుతో.. జనసేన విషయంలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. బాబుతో పవన్ పొత్తు ఉంటుందన్నట్టుగా చంద్రబాబు అనుకూల మీడియా సన్నాయి నొక్కులు నొక్కింది. దీంతో నిజంగానే పవన్ ను అభిమానించే వాళ్లు అవాక్కయ్యారు.

ఇలా మళ్లీ చంద్రబాబు రూట్లో పవన్ వెళ్తే.. సమర్థించుకోవడం కూడా కష్టం అనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే ఓవరాల్ గా పవన్ కల్యాణ్ సోలోగా పోటీ, కమ్యూనిస్టులను కలుపుకుంటున్నట్టుగా ప్రకటించాడు. ఇక ఆ మాట మీదే నిలబడాల్సిన పరిస్థితి ఉంది.

ఎన్నికల్లోపు ఏ సమయంలో ఈ మాట తప్పినా పవన్ కల్యాణ్ మరింత పలుచన అవుతాడు. ఇక ఎలాగూ పొత్తు అని పవన్ ప్రకటించాడు కాబట్టి.. సీట్ల బేరం మాట్లాడుకుందామని కమ్యూనిస్టు పార్టీల నేతలు అంటున్నారట. ఈ మేరకు వారు పవన్ ను కలిసినట్టుగా కూడా తెలుస్తోంది.

సీపీఐ, సీపీఎంలు పవన్ తో పొత్తు పెట్టుకోవడానికి మొదటి నుంచి చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ఇక ఈ పార్టీల నేతలు ఆమ్ ఆద్మీ, లోక్ సత్తాలు కూడా తమదారికే వస్తాయని చెప్పుకొచ్చాయి. అదేం జరుగుతుందో చూడాల్సి ఉంది.

ఆ సంగతలా ఉంటే.. మొత్తం 60 ఎమ్మెల్యే సీట్లను అడుగుతున్నారట కమ్యూనిస్టు పార్టీల వాళ్లు! బహుశా గత కొన్ని దశాబ్దాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఏ పార్టీతో పొత్తులతో వెళ్లినా ఇన్ని సీట్లు పోటీచేసిన చరిత్రలేదు. పవన్ కల్యాణ్ ను కమ్యూనిస్టులు ఎంత తక్కువ అంచనా వేస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఈ కోరికే రుజువు!

175 సీట్లకు గానూ మరీ 60 సీట్లను అడగటం అంటే.. కమ్యూనిస్టు పార్టీల ప్రస్తుత స్థితికిగానూ చాలా చాలా ఎక్కువే! ఏ టీడీపీతోనో, వైసీపీతోనో పొత్తుకు వెళ్లి ఉంటే.. ఎర్రన్నలు ఇన్ని సీట్లు అడగ గలిగేవారా? ఐదారు సీట్లకు మించి సాధించగలిగే వారా?

పవన్ కల్యాణ్ పార్టీకి ఇంకా ఏ నిర్మాణం లేదు కాబట్టి.. పవన్ పార్టీ మీద ఎర్రన్నలకే మరీ బీభత్సమైన అంచనాలు లేవు కాబట్టి.. అరవై.. అనే నంబర్ ను రైజ్ చేయగలుగుతున్నారు. అరవై ఎమ్మెల్యే టికెట్లు అడుగుతున్నారంటే.. ఏడెనిమిది ఎంపీ టికెట్లు కూడా అడుగుతున్నట్టే.

మరి పవన్ కమ్యూనిస్టులకు అరవై సీట్లనూ అప్పగిస్తే.. ఆయన తన పార్టీని చాలా తక్కువ చేసుకున్నట్టే. ఇక ఈ సీట్ల డీల్ ఎక్కడికి తెగుతుందో చూడాలి!

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?

టికెట్ దక్కకపోతే డబ్బులు మిగులుతాయ్!