cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

పవన్.. జగన్‌ను కాదు, జనాన్ని అవమానిస్తున్నారు!

పవన్.. జగన్‌ను కాదు, జనాన్ని అవమానిస్తున్నారు!

పవన్ కల్యాణ్ ఎలాంటి రాజకీయ ఫ్రస్ట్రేషన్ లో కొట్టుమిట్టాడుతున్నాడో మనకు స్పష్టంగా తెలియదు గానీ.. ఆయన మాట్లాడుతున్న మాటలు మాత్రం ఏదో తెలియని ఫ్రస్ట్రేషన్ ను ప్రజలకు చూపిస్తున్నాయి. రాజకీయంగా తానే బలోపేతం కావాలని అనుకున్న తర్వాత.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం సాగిస్తున్న దుర్మార్గపు పాలనను, తాను అన్నాళ్లు భుజాన మోసిన వ్యవహారాలనే తూర్పార పడుతూ.. పవన్ కల్యాణ్.. తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకోడానికి నానాపాట్లు పడుతూ వచ్చారు.

అయితే కొన్ని రోజులుగా.. అదే తరహాలో చంద్రబాబునాయుడు పాలనలోని దుర్మార్గాలపై పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం విరుచుకుపడుతున్నారు. ఒక రకంగా చూసినప్పుడు ఇలాంటి జగన్ మీద దాడిని కూడా రాజకీయ అస్తిత్వం కోసం పవన్ ఆరాటంగా అర్థం చేసుకోవచ్చు. రెండు పార్టీలను బద్నాం చేస్తే తప్ప.. తన మొహం ఎవ్వరూ చూడరని పవన్ అనుకుని ఉండొచ్చు.

కాకపోతే తాజాగా రాయలసీమలో తన పోరాటయాత్రకు అనంతపురంలో శ్రీకారం చుడుతూ.. జగన్మోహన రెడ్డి గురించి పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు మాత్రం అభ్యంతరకరంగా ఉన్నాయి. ఆ మాటకొస్తే.. తెలుగుదేశం నాయకులు కూడా జగన్ గురించి ఇంత లేకిగా మాట్లాడలేదని కూడా కొన్ని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

పవన్ మాట్లాడుతూ ‘‘ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షనేత జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా తల నిమురుతూ, బుగ్గలు గిల్లుతూ పాదయాత్ర చేసుకుంటున్నారు.’’ అంటూ పవన్ వ్యాఖ్యానించాడు. మరో రకంగ నిర్దిష్టమైన విమర్శలు చేయలేనప్పుడే ఇలాంటి చేతగాని విమర్శలు, మాటలు బయటకు వస్తాయి.

ఈ మాటల ద్వారా తాను జగన్ ను ఎగతాళి చేస్తున్నట్లుగా పవన్ అనుకుని ఉండొచ్చు గానీ.. నిజానికి ఆయన ఈ మాటలతో జగన్ ను కలుస్తున్న ప్రజలను అవమానిస్తున్నట్లే అవుతుంది. జగన్ తో బుగ్గలు గిల్లించుకోవడానికే ఆయన పాదయాత్రకు వేలాది మంది ప్రజలు ప్రతిచోటా ఎగబడి వస్తున్నారన్నట్లుగా పవన్ వ్యాఖ్యలు చాలా లేకిగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రాజకీయంగా అస్తిత్వం కోరుకుంటున్నప్పుడు పవన్ కల్యాణ్, ప్రత్యర్థుల మీద ఎలాంటి బురద చల్లడానికైనా తెగబడవచ్చు. జగన్ ఎప్పటికైనా జైలుకు వెళ్లాల్సిందే.. అంటూ ప్రజల్లో భయాన్ని రేకెత్తించడానికి ప్రయత్నించడమూ ఇలాంటిదే. కాకపోతే.. బుగ్గలు గిల్లడానికి పాదయాత్ర చేస్తున్నాడన్నట్లుగా.. ప్రజలను కించపరిచే లేకి విమర్శలు చేయడం పవన్ కు తగదు.!

ఆ పార్టీకి మినిమం మెజారిటీ గ్యారెంటీ!... ఎందుకో తెలుసా?