cloudfront

Advertisement


Home > Politics - Gossip

పవన్ కు కూడా వక్రీకరణ ఫ్యాషనే!

పవన్ కు కూడా వక్రీకరణ ఫ్యాషనే!

రాజకీయ నాయకులకు తమ నాలుక మీద అదుపు ఉండదు. సందర్భాన్ని బట్టి మాట్లాడే వాళ్లే తప్ప చిత్తశుద్ధితో నిలకడైన అభిప్రాయాలను వెల్లడిస్తూ మాట్లాడే నాయకులు మనకు లేరు. తరచూ మాట మార్చడం.. ప్రజలను ఏమార్చడం.. మారుస్తున్న మాటలను సమర్థించుకుంటూ కొత్త వాదనలు తయారు చేసుకోవడం.. ఎవరైనా తప్పులెన్నితే గనుక.. వారు తమ వ్యతిరేక శక్తులంటూ ఎదురు నిందలు వేయడం మాత్రమే ఇవాళ్టి తరం రాజకీయ నాయకులకు తెలిసిన సంగతి.

దేశానికి నవతరం రాజకీయాలు రుచిచూపించడానికి అంటూ అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ కూడా అదేమూసలో పడి కొట్టుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీ మంచి చెడుల దగ్గరినుంచి, ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి దగ్గరినుంచి, కేంద్రం పరంగా రాష్ట్రానికి ఏం జరగాల్సి ఉన్నది.. ఏం మోసం జరుగుతున్నది అనే విషయాల వరకు ఆయనకు చాలా వ్యవహారాల్లో పూర్తి అవగాహన ఉండదు.

లేదా ఈ అంశాల్లో ఇప్పటికే పలుసందర్భాల్లో పలు తీర్లుగా మాట్లాడిన ఎఫెక్ట్ .. ఆయనకు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నామో.. ఇదివరకు వారి గురించే తాను మాట్లాడిన సంగతులకు అది కాంట్రడిక్టరీ స్టేట్ మెంట్ అవునో కాదో తెలియడం చాలాకష్టం. పవన్ కల్యాణ్ అలాంటి ఇరకాటంలో ఉన్నారు. కాకపోతే.. ఆయన కూడా రెగ్యులర్ రాజకీయ నాయకుల్లాగా.. తాను అవగాహన లేకుండా మాట్లాడిన, క్లారిటీ లేకుండా మాట్లాడిన మాటలకు సంబంధించి.. మీడియా మీద నిందలు వేయడాన్ని ఒక అలవాటుగా చేసేసుకున్నట్లుగా కనిపిస్తోంది.

సోమవారం ప్రసారం అయిన తన ఇంటర్వ్యూలోని అంశాలను వక్రీకరిస్తున్నారంటూ.. ఆయన మీడియా గురించి వ్యాఖ్యానిస్తున్నారు. తమ మాటలపై తమకే క్లారిటీలేని ప్రతివారికీ.. మీడియా వక్రీకరిస్తున్నదని నిందలు వేయడం ఒక్కటే ఆల్టర్నేటివ్ కింద కనిపిస్తున్నట్లుగా ఉంది. ఆ మేరకు ఆయన ట్వీట్ చేయడాన్ని మించిన మార్గంలేదని నమ్ముకున్నట్లుగా కనిపిస్తోంది.

తాజాగా కేంద్రం హోదాతో సహా రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రతిదీ ఇచ్చి తీరాల్సిందేననే డిమాండ్ ను ఆయన ట్వీట్ ద్వారానే చెబుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఒక వ్యవస్థీకృత పార్టీలాగా బండి నడిపిస్తున్నారు గనుక.. ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసారు. మీడియాను ఫేస్ చేసి ప్రెస్ మీట్ లలో మాట్లాడితే.. ఎక్కడ ఏం నోరు జారుతామో.. ఎలాంటి కొత్త తకరారు వచ్చి పడుతుందో అని పవన్ భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది.