cloudfront

Advertisement


Home > Politics - Gossip

పవన్.. మెల్లమెల్లగా నిజరూప దర్శనం

పవన్.. మెల్లమెల్లగా నిజరూప దర్శనం

మొన్నటివరకు ఆంధ్రా-తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు పవన్ వచ్చారు. ఫ్రెష్ గా చిచ్చుపెట్టారు. ఆంధ్రా-తెలంగాణ అంటూ వేరుచేస్తూ రాజకీయాలు చేస్తున్నారు. అది కూడా తనకోసం కాదు. చంద్రబాబు కోసం. మొన్నటివరకు ఇలాంటి ప్రకటనలే కేసీఆర్ చేస్తే, విభజించే రాజకీయాలొద్దంటూ సుద్దులు చెప్పిన పవన్, ఇప్పుడు స్వయంగా తన నోటితో అవేమాటలు రిపీట్ చేస్తున్నారు. ఆంధ్రా-తెలంగాణ మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.

"ఆంధ్రప్రదేశ్ అన్నంతింటే టీఆర్ఎస్ నాయకులు చెప్పింది ఇక్కడ జరగనివ్వొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఏపీ భవిష్యత్తును టీఆర్ఎస్ చేతిలో పెట్టొద్దు." ఊగిపోతూ పవన్ కల్యాణ్ ఆవేశంగా చెబుతున్న డైలాగ్స్ ఇవి. కేవలం సెంటిమెంట్ ను రెచ్చగొట్టడం కోసమే పవన్ ఇలా ఊగిపోతూ అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు కోసం ప్రజల్ని మభ్యపెట్టే పనిని స్టార్ట్ చేశారు.

మొన్నటివరకు తెలంగాణపై పవన్ ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఒకవేళ తెలంగాణ గురించి మాట్లాడాల్సి వచ్చినా చాలా నిర్మాణాత్మకంగా, సామరస్యంగా మాట్లాడేవారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబుతో తెరవెనక ఒప్పందం కుదిరిందో, సెంటిమెంట్ ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు పవన్.

వాస్తవంగా చూసుకుంటే పవన్ నోటి నుంచి రావాల్సిన డైలాగ్స్ కావివి. ఫక్తు తెలుగుదేషం నాయకులు మాట్లాడే భావజాలమిది. అవి పవన్ నోటి నుంచి వస్తున్నాయంటే ప్యాకేజీ ఫిక్స్ అయిందని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ పైకి చెప్పకపోయినా ఇప్పటికే అతడి వ్యవహార శైలిపై ఏపీ ప్రజలకు అనుమానాలు పెరిగిపోయాయి.

చంద్రబాబును పరోక్షంగా వెనకేసుకొస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మొన్నటివరకు పవన్ పేరును ప్రస్తావించడానికి కూడా ఇష్టపడని పచ్చ పత్రికలు, ఇప్పుడు అతడి ఫొటోల్ని, వ్యాఖ్యల్ని మొదటి పేజీలో అచ్చువేస్తున్నాయంటే దానికి కారణం ఏంటో ప్రజలు మెల్లమెల్లగా గ్రహిస్తున్నారు.

జనసేనాని నిజరూపం ఇప్పుడిప్పుడే ఆవిష్కృతమౌతోంది. టీడీపీకి మద్దతిచ్చే అతడి నైజం మెల్లమెల్లగా బయటపడుతోంది. ఎన్నికలు దగ్గరయ్యేకొద్దీ పవన్, బాబు మాట్లాడుతున్న మాటల్లో అస్సలు తేడా కనిపించదు. ఇద్దరీ టార్గెట్ ఒకరే. ఇద్దరి డైలాగ్స్ ఒకటే. ప్రజలు ఈ విషయాన్ని ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. లేదంటే మరోసారి భ్రమరావతి గ్రాఫిక్స్ కు రెడీ అయిపోండి.

రుణమాఫీ భ్రమలకు సిద్ధంగా ఉండండి. మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్లడానికిక మానసికంగా సన్నద్ధంకండి. మిమ్మల్ని దోపిడీ చేయడానికి మీరే అనుమతి ఇస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండని పలువురు మేధావులు విశ్లేషిస్తున్నారు.

అమరావతి ప్రస్తావన లేని ఎన్నికలు!