cloudfront

Advertisement


Home > Politics - Gossip

చాపక్రింద నీరులా పవన్ కళ్యాణ్-టార్గెట్ 2024

చాపక్రింద నీరులా పవన్ కళ్యాణ్-టార్గెట్ 2024

2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ని రాజకీయాల వైపుకు మళ్లించిన పొట్లూరి వర ప్రసాద్ ( పీవీపీ ) విజయవాడ పార్లమెంట్ సీటును వైస్సార్సీపీ నుండి ఆశించినా, గెలుస్తున్నాము అనే భ్రమలో వున్న వైస్సార్సీపీ అధినేత జగన్ యొక్క అనుభవ రాహిత్యంతో టికెట్ పీవీపీకి ఇవ్వకుండా తృణీకరించగా, ఆ కోపంతో టీడీపీకి పవన్ ను దేగ్గర చేస్తే, అంది వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు అంది పుచ్చుకొని పవన్ కళ్యాణ్ తో జత కట్టి అధికారాన్ని చేపట్టేడు.

అధికార టీడీపీ ఎప్పుడు ఆపదలో వున్నా 4ఏళ్ళుగా ఆదుకుంటున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు సడన్ గా రూటు మార్చి తాను న్యూట్రల్, ఎవ్వరికి చెందను, ప్రజల మనిషిని అనే పవన్ పోకడలో గొప్ప వ్యూహం దాగి వుంది. అధికార పార్టీ అండ లేనిదే ఏ సభలకు అనుమతి కూడా ఉండదు తెలుగు రాష్ట్రాల్లల్లో. అటువంటిది పవన్ ఎక్కడికి వెళ్లినా అప్రతిహతంగా, అధికారుల అండ దండలు స్పష్టంగా కనపడుతోంది.

పవన్ సభ తరవాత యెల్లో మీడియాలో ఇచ్చిన విస్తృత ప్రాధాన్యత చెప్పనకనే చెపుతుంది పవన్ కి టీడీపీ అండదండలు వున్నాయి అని. కింగ్ మేకర్ లో వున్న రుచిని పవన్ కళ్యాణ్ పూర్తిగా ఆస్వాదించాడు, ఇప్పటికిప్పుడు తాను సీఎం అని ముందుకు వస్తే అందరికి చెడి ఒంటరిగా మిగులుతాడు అనే సత్యం బాగా అర్ధం ఐన వాడు పవన్ కళ్యాణ్, బాబుని కాదని టీడీపీ, యెల్లో మీడియా వర్గాలు, జగన్ ని కాదని వైస్ అభిమానులు తనకు అండగా నిలువరనే సత్యం పవన్ కు పూర్తిగా తెలుసు.

కేవలం కాపులను, సినిమా అభిమానులను నమ్ముకొని సీఎంగా ముందుకు వస్తే తాను చిరంజీవిలాగా ఓడిపోయి రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకోవాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు. అందుకే చిరంజీవి చేసిన తప్పులు చెయ్యకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు పవన్. 2019లో కూడా పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ పాత్రనే ఇష్టపడతాడు. ఎటు మొగ్గు తాడో ఇప్పటికి ఇప్పుడు తెలియదు కానీ బలమైన, గెలిచే పక్షం వైపు మొగ్గుతాడు.

ప్రస్తుతానికైతే చంద్రబాబు నీడ నుండి మాత్రం అప్పుడే బయటకు రాడు, స్వతంత్రంగా వున్నట్టే టీడీపీ, జనసేన బాహ్య ప్రపంచానికి కనపడతారు. బీజేపీతో ఎట్టి పరిస్థితులలో కలవక పోవొచ్చు. వైస్సార్సీపీతో కూడా కష్టమే ఎందుకంటె పవన్, జగన్ ఉత్తర, దక్షణ ధ్రువాలు, చంద్రబాబులాగా అవసరానికి అందరిని కలుపుకు పొయ్యే లౌక్యం జగన్ కు లేదు. తానూ చెప్పిందే వేదం, తానె హై కమాండ్ తానె లొ కమాండ్, అన్ని తానె. అటువంటి మనస్తత్వంతో పవన్ కలవడం కష్టమే, అలాగనీ చంద్రబాబుతో కూడా వెళ్ళాక పోవొచ్చు.

జగన్ 2019లో ఖచ్చితంగా గెలిచే సూచనలు వున్నాయి అనుకుంటే పవన్, జగన్ తో జత కట్టినా ఆశ్చర్యం లేదు, తన అధోగతి పాలనతో ప్రజలలో పూర్తి వ్యతిరేకత వుంది అని గ్రహించిన బాబు, తాను పెంచి పోషించిన జనసేనను అంత తొందరగా తన నుండి దూరం కానివ్వడు. నువ్వు నేను వేరు వేరు, ఎన్నికలు వేరుగా కలబడి, యాంటీ ఇంకేబన్సీ ఓట్లు చీల్చి బాబుకు లబ్ది చేకూరే విధంగా టీడీపీ పెద్దలు, రాజగురువులు నడిపించవొచ్చు. రాజ గురువు, చిన్న గురువు, యెల్లో మీడియా చీల్చి చండాడుతుంది పవన్ కళ్యాణ్ వారికి వ్యతిరేకంగా వెళ్ళితే. అది పవన్ కళ్యాణ్ కు పూర్తిగా తెలుసు.

ప్రజలలో పవన్ కళ్యాణ్ మీద చిరంజీవి కంటే మంచి వాడు, సమర్ధుడు, ఏదో చెయ్యాలి అనే తపన వున్నవాడు అనే పేరు తెచ్చుకున్నాడు. జగన్ మీద కేసులు, అవినీతి మరకలు యెల్లో మీడియా పూసి పూసి అది అర్బన్ జనాల బుర్రలోకి బాగానే వెళ్ళింది, ఎన్నికలకి ముందు కనీసం కొన్ని కేసులైన జగన్ మీద కొట్టి వేస్తేనే జనాల బుర్రలోకి పాజిటివ్ గా జగన్ కనపడతాడు. అలాగని వైస్సార్ అని అభిమానించే అనేక వర్గాలు నేటికీ జగన్ కు అండగానే వున్నాయి.

ఇక చివరి బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఛాన్స్ లేదు, వారతో ఎవ్వరు వెళ్లినా అది వారికే నష్టం. పైన ఉదహరించిన అనేక విషయాలను వల్లే వేసుకుంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ 2019లో కింగ్ మేకర్ పాత్ర పోషించడానికి ఎక్కువ మొగ్గు చూపుతాడు, పవన్ అంతిమ లక్ష్యం 2024. 2019లో చంద్రబాబుకు సహకరించి మళ్ళీ బాబుని సీఎం చేసి 
( రెండు సార్లు సీఎం అయినాక మూడవ సారి సీఎం అవడం చాలా కష్టం). అప్పుడు తానె సీఎం అని 2024లో రావొచ్చు, లేదా జగన్ కు సహకరించి, చూసారా ఇద్దరికీ సహకరించాను ఇద్దరు ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు నేను తప్ప వేరే ఎవ్వరు లేరు అని అయినా 2024కి వస్తాడు పవన్.

అయినా ఇప్పటికి ఇప్పుడు 2019లో తాను సీఎం అని అనాలని వున్నా, జనసేనకు బలమైన పార్టీ నిర్మాణం లేదు, ప్లస్ 2019కోసం రెండు బలమైన ( కమ్మ, రెడ్డి ) వర్గాల రాజకీయ పోరులో తానూ నలిగి పోతాను అనే విషయం కూడా సుస్పష్టంగా తెలుసు. ఒక వర్గానికి 2014లో సహకరించి, రెండో వర్గానికి 2019లో సహకరించి, ఇద్దరు ఫెయిల్ అయ్యారు అని 2024లో జనల ముందుకు వచ్చే అవకాశం కూడా వుంది.

అప్పుడు తన అన్న చిరంజీవితో కూడా జత కట్టి అన్ననే సీఎం చేసే ప్రయత్నం చెయ్యొచ్చు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎప్పుడు విడిపోలేదు, విడిపోరు కూడా. పవన్ కళ్యాణ్ వెరసి చాలా వ్యూహాత్మకంగా రాజకీయ అడుగులు వేస్తున్నాడు.

-రమణా రెడ్డి
-ఆస్ట్రేలియా