cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

పవన్ ను ఎవరికైనా చూపించాలి

పవన్ ను ఎవరికైనా చూపించాలి

విభజన సమయంలో కులం, మతం అని చూడకుండా, ఆంధ్రులు అని చూసి, తెలంగాణ నుంచి తన్ని తరిమేసారు.

2019 నుంచి 2021 వరకు సంకీర్ణ ప్రభుత్వాలే అధికారంలోకి వస్తాయి.

జగన్ ముద్దులు పెట్టుకుంటూ పాదయాత్ర చేస్తున్నాడు.

లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వుండదని, జనసేన ప్రభుత్వం వచ్చాక పెట్టుబడులు పెడతాం అని పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారు.

చాలామంది విదేశీ పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. రాబోయేది జనసేన ప్రభుత్వమే అని.

ఇవన్నీ పవర్ స్టార్ అనబడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూక్తి ముక్తావళి లేదా సుభాషితాలు.

మీడియా వ్యవహారం బాగా తెలిసింది పవన్ కళ్యాణ్ కు.

సాక్షి రాసుకోవడం కోసం చంద్రబాబును తిడతారు.

ఆంధ్రజ్యోతి రాసుకోవడం కోసం జగన్ ను తిడతారు.

వీళ్లు అది హైలైట్ చేస్తూ రాస్తారు. వాళ్లు అది హైలైట్ చేస్తూ రాస్తారు. మొత్తానికి రెండు పత్రికల్లో పవన్ కు కవరేజీ వస్తుంది. ఈ తెలివితేటలు బాగానే వున్నాయి. కానీ మాట్లాడే మాటలే చిత్రంగా వుంటున్నాయి. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియని రీతిగా వుంది.

పైన కోట్ చేసిన మాటలు చదువుకుంటే చాలు పవన్ వైఖరి అయోమయం అని అర్థం కావడానికి. ఏ జిల్లాలోనూ కార్యవర్గం లేదు. సరైన నాయకులు లేరు. ఆయన ఈస్ట్, అనంతపురం మీద దృష్టి పెట్టినట్లుగా మరో జిల్లాను పట్టించుకోరు. చంద్రబాబు పార్టీకి పట్టు వున్న కృష్ణ, గుంటూరు జోలికి వెళ్లరు.

ఇవేవీ చేయకుండా ఆంధ్రలో పవర్ తమదే, జనసేన ప్రభుత్వం వస్తుందని పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారు అంటారు. మళ్లీ ఆయనే సంకీర్ణ ప్రభుత్వం అంటారు. టీడీపీ, లేదా వైకాపా లేకుండా జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఎలా వస్తుంది?

జగన్ అవినీతి అంటూ, లోకేష్ ఇసుక మింగేసారు అంటూ, చంద్రబాబు ది అంతా అవినీతి అంటూ, మరి జనసేన పార్టీ వాళ్లతో కలిసి సంకీర్ణం ఎలా ఏర్పాటు చేస్తుంది? అసలు తెలంగాణ నుంచి ఎవర్ని తరిమేసారు? పవన్ ఎక్కడ వున్నాడు హైదరాబాద్ లో కాదా? ఏ ఒక్క సెటిలర్ అయినా గత నాలుగేళ్లలో హైదరాబాద్ లో ఇబ్బంది పడిన దాఖలా వుందా?

చంద్రబాబు, లోకేష్ మినహా వాళ్ల కుటుంబ సభ్యులతో సహా హైదరాబాద్ లో సెటిల్ అయిన ఏ ఒక్క ఆంధ్రుడు అయినా వెనక్కు వచ్చారా? పవన్ ను ఇలా వదిలేయాలా? ఎవరికైనా చూపించాలా? జనాలే డిసైడ్ చేసుకోవాలి.

ఆ పార్టీకి మినిమం మెజారిటీ గ్యారెంటీ!... ఎందుకో తెలుసా?