‘పవన్’పై దూసిన ‘కత్తి’

ఇదీ లేటెస్ట్ గా రాజకీయ సంచలన వాఖ్యాత కత్తి మహేష్ కామెంట్. ఆయన తన ఫేస్ బుక్ వాల్ మీద వేసిన ఈ పోస్ట్ కచ్చితంగా కాస్త సంచలనం సృష్టిస్తుంది అన్నది వాస్తవం. పవన్…

ఇదీ లేటెస్ట్ గా రాజకీయ సంచలన వాఖ్యాత కత్తి మహేష్ కామెంట్. ఆయన తన ఫేస్ బుక్ వాల్ మీద వేసిన ఈ పోస్ట్ కచ్చితంగా కాస్త సంచలనం సృష్టిస్తుంది అన్నది వాస్తవం. పవన్ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో, అది కూడా వరద, డ్రోన్ రాజకీయాల్లో జగన్ ను, వైకాపాను టార్గెట్ చేసిన సమయంలో కత్తి మహేష్ చేసిన ఈ కామెంట్ కు సరైన ప్రాధాన్యత వుంటుంది.

అయితే ఇదెంత వరకు నిజం అన్నది మాత్రం అంత సులువుగా తేల్చేదికాదు. ఎందుకంటే కావూరి హిల్స్ లో 130 కోట్ల ఖరీదైన ఇల్లు అన్నది కాస్త సందేహాస్పదం. ఎకరా వందకోట్లు వుంటుంది అనుకుంటే, పవన్ కొన్న ఇల్లు ఎకరాకు పైగా స్థలంలో వుండి వుండాలి. ఎందుకంటే కావూరి హిల్స్ లో అంతకన్నా రేటు లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ కత్తి మహేష్ ఈ విషయంలోనూ కౌంటర్ వేస్తున్నారు. కావాలంటే అంత ఖరీదైన ఇళ్లు ఆ ప్రాంతాల్లో వున్నాయని అంటున్నారు.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఇంత ఖరీదైన ఇల్లు అక్కడ కొనివుంటే బయటకు తీయడం అన్నది పెద్ద కష్టంకాదు. ఆంధ్ర-తెలంగాణల్లో స్నేహపూర్వక ప్రభుత్వాలే వున్నాయి కనుక, నిమిషాల్లో డాక్యుమెంట్ జిరాక్స్ లు బయటకు వస్తాయి. అవి వస్తే ఇల్లు ఫోటోలు బయటకు వస్తాయి.

కత్తి మహేష్ చేసిన ఆరోపణ లేదా కామెంట్ కు కొనసాగింపుగా ఆధారాలు రాకపోతే, ఉత్తరోత్తరా ఆయన చేసే వాటికి విలువ వుండదు. అందుకే ఆ ఆధారాలు సంపాదించి అందిచే పనిలో కత్తి మహేష్ నిమగ్నమై వున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే పవన్ ఫ్యాన్స్ వైపు నుంచి ఎదురు విమర్శ కూడా వినిపిస్తోంది. ఎన్నికల అనంతరం కత్తి మహేష్ పోలిటికల్ గా సైలంట్ అయిపోవాల్సి వచ్చిందని, ఆయనకు వైకాపా ఏమీ పదవి ఇవ్వలేదని, అందుకే మళ్లీ తను పొలిటికల్ గా లైమ్ లైట్ లోకి రావడం కోసం ఈ సంచలనానికి తెరతీసారని ప్యాన్స్ ఎదురు ఆరోపణ చేస్తున్నారు.

ఈ డిస్కషన్ నడుమ పవన్ ఇంటి ఫొటోలు బయటకు వచ్చేస్తే, కత్తి మహేష్ మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతారు.

జగన్ మేనమామపై అసంతృప్తి జ్వాలలు!