cloudfront

Advertisement


Home > Politics - Gossip

పవన్ ఇలా చేస్తే.. బాబు బజార్న పడ్డట్టే!

పవన్ ఇలా చేస్తే.. బాబు బజార్న పడ్డట్టే!

ఇప్పుడు తెలంగాణకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ పడిపోగా.. విపక్షాలు ఇప్పుడే సమరానికి అస్త్రాలను వెతుక్కుంటూ, సరిచేసుకుంటూ ఉన్నాయి. ఇంకా ఏయే పార్టీలు ఎలా  పొత్తులు కడతాయో తేలవలసి ఉంది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో తనకు ప్రస్తుతం పెద్దగా అస్తిత్వం లేకపోయినప్పటికీ... ఏపీలో కూడా చంద్రబాబు బద్నాం కావాలంటే.. పవన్ కల్యాణ్ ఓ మాస్టర్ ఎత్తుగడ అనుసరిస్తే సరిపోతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.

చంద్రబాబునాయుడు ఎటొచ్చీ.. పొత్తుల్లేకుండా తెలంగాణ ఎన్నికలను ఎదుర్కొనే ఉద్దేశంతో లేరు! ఇప్పటికే సీపీఐ, టీజేఎస్ లతో మంతనాలు పూర్తిచేసినట్లు కనిపిస్తోంది. సీపీఎం ఒక్కటీ.. వారికి నో చెబుతోంది. కాంగ్రెస్ తో కూడా జట్టుకట్టాలనే చంద్రబాబు తహతహ లాడుతున్నారు గానీ.. ఏపీలో పరువుపోతుందేమో అని భయపడుతున్నారు.

ఇలాంటి పరిస్థితిలో పవన్ ఒక స్టెప్ తీసుకుంటే చంద్రబాబు పని కుడితిలో పడ్డ ఎలుకలా తయారవుతుందని పలువురు అంటున్నారు. లెఫ్ట్ పార్టీలు అంటే సీపీఐ కూడా విధిగా ఉండేట్లయితే సీపీఎం చెబుతున్న కూటమిలోకి జనసేన రావడానికి తనకు అభ్యంతరం లేదని పవన్ కల్యాణ్ తమ్మినేని వీరభద్రం ప్రతిపాదనకు ఓకె చెప్పాలి. అయితే ఆ కూటమిలో తెలుగుదేశం గానీ, కాంగ్రెస్ గానీ.. ఉండరాదని నిబంధన కూడా పెట్టాలి. అదే జరిగితే... చంద్రబాబుకు ఇబ్బందులు తప్పకపోవచ్చనేది పలువురి విశ్లేషణ.

ఎందుకంటే.. సదరు కూటమి పేరు మీద సీపీఐ, సీపీఎం బహుజన పార్టీలతో జనసేన కలిపి ఒక కూటమి ఏర్పడితే టీజెఎస్ కూడా సహజంగా ఆ కూటమిలో ఉండడానికే ఇష్టపడుతుంది. అందులోకి చంద్రబాబుకు ఎంట్రీ ఉండదు. అలాంటప్పుడు ఇక భాజపా, కాంగ్రెస్ తప్ప చంద్రబాబు జట్టుకట్టడానికి మరో ప్రత్యామ్నాయం ఉండదు. భాజపా సంగతి సరేసరి. ఇక కాంగ్రెస్ మాత్రమే ఏకైక ఆప్షన్ గా ఉంటుంది.

మరో రకంగా చూసినప్పుడు కాంగ్రెస్ తో జట్టుకట్టడం చంద్రబాబుకు అయిష్టం ఎంతమాత్రమూ కాదు. కాకపోతే.. అదే కూటమిలో మరికొన్ని పార్టీలు (ఫరెగ్జాంపుల్ సీపీఐ లేదా టీజేఎస్) కూడా ఉంటే.. చంద్రబాబు తన ఏపీ ప్రజలకు సర్దిచెప్పుకోడానికి అవకాశం ఉంటుంది. అలాకాకుండా.. మిగిలిన చిన్న పార్టీలన్నీ ఒక జట్టుగా ఏర్పడి- చంద్రబాబును దరికి రానివ్వకుంటే.. ఆయన విధిగా కాంగ్రెస్ తో మాత్రమే వెళ్లాలి. అదే జరిగితే.. ఏపీలో పరువు సాంతం పోతుంది. ఎంత గతిలేకపోయినా సరే.. కాంగ్రెస్ కాళ్లు పట్టుకుంటారా? అని యావత్ రాష్ట్రం చీదరించుకుంటుంది.

అలాంటి పరిస్థితిని సృష్టించాలంటే.. పవన్ కల్యాణ్.. ‘‘చంద్రబాబు లేని సీపీఐ- టీజేఎస్- సీపీఎం కూటమి అయితే తాను జతకలుస్తా’’ అంటూ ప్రతిపాదిస్తే బెటరని పలువురు అనుకుంటున్నారు.