Advertisement


Home > Politics - Gossip
అరె.. పవన్ ఏంటి అలా పారిపోయాడు!

ఛలోరే ఛలోరే ఛల్ అనే పదానికి అర్థమేంటో ఇన్నాళ్లకు తెలిసొచ్చింది. చెప్పాల్సిన 4 ముక్కలు చెప్పేసి మీడియాకు దొరక్కుండా పారిపోవడమే "ఛలోరే ఛలోరే ఛల్" అంటూ సరికొత్త అర్థాన్నిచ్చారు జనసేనాని. నిన్న జరిగిన మీడియా సమావేశంలో పవన్ వ్యవహారశైలి కొంత నవ్వు తెప్పిస్తే, మరికొంతమందికి చిరాకు పుట్టిచ్చింది.

అవిశ్వాస తీర్మానంపై వైఎస్ఆర్సీ పార్టీ అధినేత జగన్ విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నానంటూ ప్రెస్ మీట్ పెట్టారు పవన్. జగన్ అవిశ్వాసం పెడితే మద్దతిస్తానని, మిగతా ఎంపీల మద్దతు తను కూడగడతానని ప్రకటించారు. "నేను సవాల్ స్వీకరిస్తున్నాను. సవాల్ కు రెడీ" అంటూ మాట్లాడిన పవన్.. దానిపై స్పందించేందుకు మాత్రం నిరాకరించారు. తను చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేసి పరుగు లంకించుకున్నాడు. మీడియాను కనీసం ఒక్కప్రశ్న కూడా అడిగే ఛాన్స్ ఇవ్వలేదు.

ఆ పరుగేంటి పవన్..? సవాల్ చేసి పారిపోవడం ఎందుకు..? మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పొచ్చు కదా! ప్రశ్నలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేనప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు? చెప్పదలుచుకున్న ఆ నాలుగు మాటలేవో ట్విట్టర్ లో పెడితే సరిపోతుంది కదా..

లేకపోతే తను సినిమా ప్రమోషన్ చేసినట్టు సొంతంగా తనే 4 నిమిషాల వీడియో తీసి మీడియాకు మెయిల్ చేస్తే సరిపోతుంది కదా. ప్రశ్నలు ఎదుర్కోవడం ఇష్టంలేనప్పుడు ఇలాంటి పనులు చేస్తే సరిపోతుంది. కానీ మీడియాను పిలిచి ఒక్క ప్రశ్న కూడా అడిగే అవకాశం ఇవ్వకుండా తుర్రును జారుకోవడం దేనికి?

మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రారంభిస్తే తనలో అజ్ఞానం బయటపడుతుందని పవన్ భావించి ఉండొచ్చు. లేకపోతే అవిశ్వాసం అనే వివాదాన్ని మరింత కెలకడం ఇష్టంలేక ప్రెస్ మీట్ నుంచి జారుకొని ఉండొచ్చు. ఈ రెండూ కాకపోతే మరో రీజన్ ఉంది. నిన్న జరిగిన పరిణామాల బట్టి చూస్తుంటే.. పవన్, చంద్రబాబు కలిసి అంతవరకే స్క్రిప్ట్ రాసుకొని ఉండొచ్చు. 

మొత్తమ్మీద ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్, మీడియాకు మాత్రం ప్రశ్నించే అవకాశం లేకుండా చేయడం విడ్డూరం.