cloudfront

Advertisement


Home > Politics - Gossip

మరోసారి విడాకులకు రెడీ అవుతున్న పవన్

మరోసారి విడాకులకు రెడీ అవుతున్న పవన్

ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా ఒకటికంటే ఎక్కువ స్థానాల్లో పోటీచేయొచ్చు. ఇలాంటి ప్రయోగాలు కొంతమందే చేస్తుంటారు. చాలామంది తమకు అనుకూలమైన చోట, విజయావకాశాలు ఎక్కువగా ఉన్నచోట మాత్రమే బరిలో దిగుతారు. విజయమో, పరాజయమో అక్కడే తేల్చుకుంటారు. అప్పట్లో ఎన్టీఆర్ ఒకేసారి మూడు నియోజకవర్గాల్లో అసెంబ్లీకి పోటీచేసి మూడుచోట్లా గెలిచారు. మరోమూడు దఫాలు రెండు నియోజకవర్గాల్లో ఒకేసారి పోటీచేశారు. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో ఎవరూ ప్రయోగాలు చేయలేదు.

ప్రజారాజ్యం తరపున చిరంజీవి రెండు నియోజకవర్గాల్లో పోటీచేసి ఒకచోట మాత్రమే గెలిచారు. మళ్లీ ఇప్పుడు చిరు సోదరుడు పవన్ కల్యాణ్ రెండు పడవలపై కాలుపెట్టారు. గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పవన్ పోటీ చేస్తున్నారు. అయితే పవన్ ప్రచారంపై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు పడుతున్నాయి.

నామినేషన్లు వేశాక స్థానిక సమస్యలను ప్రస్తావించకుండా గాజువాక, భీమవరంలో ఒకే క్యాసెట్ ని రిపీట్ చేశారు పవన్ కల్యాణ్. ప్రపంచస్థాయి నగరాలుగా మార్చివేస్తానని, నిత్యం స్థానికంగా అందుబాటులో ఉంటానని, నియోజకవర్గానికి ఎవరూ ఎప్పుడూ తేలేని ప్రత్యేక ఇమేజ్ తీసుకొస్తానని చెప్పుకొచ్చారు.

మరి పవన్ రెండు స్థానాల్లో గెలిస్తే పరిస్థితి ఏంటి? ఈయన చెబుతున్న మాటల్లో వాస్తవం ఎంత? రెండుచోట్లా గెలిస్తే ఒక నియోజకవర్గాన్ని కచ్చితంగా వదులుకోవాల్సిందే. అలాంటప్పుడు పవన్ మాటలు సత్యదూరమే కదా? ఆ సంగతి పక్కనపెడితే.. పవన్ కి విజయంపై ధీమా లేకనే గాజువాక, భీమవరం అంటూ రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నారని కామెంట్లు పడుతున్నాయి.

పవన్ కి ఏదైనా ఒకటికంటే ఎక్కువ కావాలని అవి పెళ్లిళ్లయినా, నియోజకవర్గాలయినా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. తన విజయంపైనే నమ్మకంలేని పవన్, తన పార్టీ గుర్తుపై పోటీచేస్తున్న వారిని ఎలా గెలిపిస్తారని, ముఖ్యమంత్రి ఎలా అవుతారని ఎద్దేవా చేస్తున్నారు.

ఆదర్శాలు వల్లించే పవన్ కల్యాణ్ ఉప ఎన్నిక భారం ప్రజలపై ఎలా మోపుతారని, రెండుచోట్ల ఎందుకు పోటీ చేస్తున్నారని కొంతమంది నిలదీస్తున్నారు. రెండు నియోజకవర్గంలో ఓ ఆశావహుడికి టికెట్ ఇచ్చి సామాజిక న్యాయం చేయొచ్చుకదా అని సలహాలిస్తున్నారు.

మొత్తానికి పవన్ రెండు నియోజకవర్గాల పోటీ ఆయనపై లేనిపోని కామెంట్లను తెచ్చిపెడుతోంది. పెళ్లిళ్లతో నియోజకవర్గాలను పోలుస్తూ.. రెండుచోట్లా పవన్ గెలిస్తే.. మరోసారి విడాకులు గ్యారెంటీ అంటున్నారు. 

అమరావతి ప్రస్తావన లేని ఎన్నికలు!