cloudfront

Advertisement


Home > Politics - Gossip

లోకేష్ మీద పవన్ సెటైర్

లోకేష్ మీద పవన్ సెటైర్

పవన్ కళ్యాణ్ ఓ సెటైర్ వేసారు. నేరుగానే. ఎవరిమీదనో కాదు. చినబాబు లోకేష్ నాయుడు మీదనే. గతంలో కూడా లోకేష్ నాయుడు మీద పవన్ బోలెడు బాణాలు వేసారు. అయితే ఈసారి ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిగా పనిచేయడం మీద ఓ చణుకు విసిరారు.

నటుడు, సోదరుడు నాగబాబును నరసాపురం ఎంపీ టికెట్ కు ఎంపిక చేయడంపై పవన్ మాట్లాడుతూ, తాను తన సోదరుడిని దొడ్డిదారిన తీసుకురావడం లేదన్నారు. రాజమార్గం గుండా తీసుకువచ్చి, ప్రజాక్షేత్రంలో పోటీకి నిలబెట్టానన్నారు.

ఇది నేరుగా లోకేష్ మీద బాణం తప్ప వేరుకాదని అర్థం అవుతూనే వుంది. లోకేష్ నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకుండా ఎమ్మెల్సీగా ఎన్నికై, మంత్రిగా అధికారం చేపట్టారు. దానిమీద అన్నివైపుల నుంచి విమర్శలు వున్నాయి. ఇప్పుడు పవన్ కూడా అదేమాట విసిరారు. చిత్రమేమిటంటే ఇప్పడు లోకేష్ బాబు నేరుగా ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తున్నారు.  

పరిటాల కుటుంబం గెలిస్తే.. వీళ్లంతా పారిపోవాల్సిందే

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?