cloudfront

Advertisement


Home > Politics - Gossip

పవన్ ఉద్ధారకుడి డైలాగులు మానేయాలి!

పవన్ ఉద్ధారకుడి డైలాగులు మానేయాలి!

పవన్ కల్యాణ్ తనకు మూడ్ వచ్చినప్పుడెల్లా.. యాత్రలు మొదలెడతాడు. ఆ యాత్రల్లో జనం పల్స్ ను బట్టి.. అటు చంద్రబాబును, ఇటు జగన్ ను అడ్డగోలుగా తిట్టిపోస్తుంటాడు. వారి నుంచి కౌంటర్లు వస్తే మాత్రం ఉక్కిరిబిక్కిరి అయిపోయి రెచ్చిపోయి సమాధానాలు ఇస్తుంటాడు. తన లోపాలను జగన్మోహన్ రెడ్డి ఎత్తి చూపుతోంటే.. వాటికి కౌంటర్లు ఇవ్వలేని తన అసమర్థతకు పవన్ కల్యాణ్.. ‘స్త్ర్రీ జనోద్ధారక’ ముసుగు తగిలిస్తున్నారు. ఆ జనోద్ధారక డైలాగులతో ఆయన కొత్తగా నవ్వులపాలయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.

జగన్మోహన రెడ్డి ఎప్పటికైనా జైలుకెళ్లాల్సిందే.. అంటూ పవన్ దెప్పిపొడిచిన తర్వాత.. సహజంగానే ఆ పార్టీనుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. వివాహ బంధం పట్ల విశ్వాసం లేకుండా.. ఆటబొమ్మలను మార్చినట్లుగా భార్యలను మార్చే పవన్ అలవాటును జగన్మోహన్ రెడ్డి కూడా ఎత్తి చూపించారు. తనలోపాలను ప్రశ్నించేసరికి.. పవన్ కల్యాణ్ కు ఉడుకుమోతుతనం వచ్చేసినట్లుంది. రెచ్చిపోయి స్పందిస్తున్నారు.

పవన్ కల్యాణ్ నిత్యపెళ్లికొడుకు వేషాల గురించి జగన్ ప్రశ్నిస్తే.. అక్కడికేదో ఆయన ఆడపడచుల్ని అవమానించినట్లుగా రంగుపులమడానికి పవన్ విఫలయత్నం చేస్తున్నారు. ‘మీ ఆడపడుచులను తిడదామంటే నా సంస్కారం ఒప్పుకోదు. మా అమ్మ నన్నలా పెంచింది.

కోడి కత్తి విషయంలో తెదేపా వారు జగన్‌ తల్లిపై ఆరోపణలు చేస్తే ఖండించింది నేనే అనేది ఆయన గుర్తుంచుకోవాలి. రేప్పొద్దున మీకు ఓట్లేయకపోతే జనాన్నీ ఇలాగే తిడతారా?’ అంటూ ఆయన వక్రభాష్యాలతో తన విమర్శలను సంధిస్తున్నారు.

నిత్య పెళ్లికొడుకుగా పవన్ గురించి నిలదీస్తే.. అక్కడికేదో ఆడజాతిని గేలిచేసినట్లుగా పవన్ రంగుపులమడం ఏంటో అర్థంకావడం లేదు. ‘మీ ఆడపడచుల్ని తిట్టడానికి నా సంస్కారం ఒప్పుకోదు’ అంటూ చిలకపలుకులు పలుకుతున్న పవన్.. నిజానికి జగన్ ఏ ఆడపడచును తిట్టాడో.. తేల్చి చెప్పగలడా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

భార్యలను అంగట్లో కొనే బొమ్మల్లాగా తరచూ మార్చేసే అలవాటున్న పవన్ కల్యాణ్... తానేదో స్త్రీ జనోద్ధారకుడు అన్నంత బిల్డప్ ఇస్తూ సంస్కారం గురించి మాట్లాడడం చాలా లేకిగా ఉన్నదని జనం అనుకుంటున్నారు.

తెలంగాణ వోటింగ్ ఇవాలే... ముళ్లు ఎటువైపు తిరుగనుంది?