Advertisement


Home > Politics - Gossip
పవన్ స్ట్రోక్: పూనం కౌర్ పదవికి గండం

చంద్రబాబునాయుడు అనుభవం, మోడీ సమర్థత వలన అనాథ లాగా ఏర్పడిన రాష్ట్రానికి మంచి జరగుతుందనే ఉద్దేశంతోనే తాను వారికి అనుకూలంగా 2014 ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాను తప్ప.. తాను వారినుంచి ఒక్క పదవి కూడా ఆశించలేదని, స్వీకరించలేదని పవన్ కల్యాణ్ చాలా డాంబికంగా గుంటూరు సభలో ప్రకటించారు.

పనిలో పనిగా.. తెలుగుదేశం సర్కారు అరాచక పాలర, అవినీతి వ్యవహారాల మీద కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ పవన్ దాడికి కౌంటర్లు ఇవ్వడం ఎలాగా? అని తెలుగుదేశం వ్యూహకర్తలు ఇప్పుడు తర్జన భర్జనలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా.. పవన్ సిఫారసుతో రాష్ట్రప్రభుత్వపు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితురాలైన మాజీ హీరోయిన్ పూనం కౌర్ ను ఆ పదవిని తొలగించాలని తెలుగుదేశం పెద్దలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

పూనం కౌర్ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వపు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా టాప్ రేంజి హీరోయన్ ను సమంతను నియమించుకుంటే.. దానికి పోటీనా అన్నట్లుగా ఏపీ ప్రభుత్వం అప్పట్లో తమ ప్రభుత్వానికి ఫేడవుట్ అయిపోయిన ఒకనాటి హీరోయిన్ పూనం కౌర్ ను నియమించుకుంది. చేనేతల ప్రచారానికి ఆమెతో కొన్ని కార్యక్రమాలను నిర్వహించింది. చేతిలో ఒక్క సినిమా కూడా లేని ఈ మాజీ నటి ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ అనే హోదా తప్ప మరేమీ లేకుండా.. రోజులు వెళ్లదీస్తోంది.

అయితే ఇటీవలి కాలంలో.. కత్తి మహేష్ విమర్శల సమయంలో.. పూనం కౌర్ కు ఆ పదవి.. పవన్ కల్యాణ్ సిఫారసు వల్లనే దక్కిందనే మాట బయటకు వచ్చింది. ఆమెతో తనకు వ్యక్తిగతంగా ఉన్న సుదీర్ఘ పరిచయం కారణంగానే పవన్ ఆ పదవి ఇప్పించారని బాగా ప్రచారం జరిగింది.

నిజానికి బ్రాండ్ అంబాసిడర్ అయినంత మాత్రాన పెద్దగా నెలవారీ వేతనాలు ఏమీ ఉండవు. కానీ.. పెర్క్స్ రూపేణా ఘనంగా ముట్టజెపుతుంటారు. కార్యక్రమాలకు ఆహ్వానించినప్పుడు... ఖర్చుల రూపేణా ఇచ్చే మొత్తాలు కూడా భారీగానే ఉంటాయి. చేతిలో సినిమాలు లేని ఆమెకు ఇది చాలా ఎక్కువ.

కాగా, ఇప్పుడు ఆమెను ఆ బ్రాండ్ అంబాసిడర్ పదవినుంచి తొలగించాలని బాబు సర్కారు సిద్ధపడుతున్నదిట. పవన్ వల్లనే ఆమెకు పదవి వచ్చిందనే ప్రచారం ప్రజల్లో బాగా ఉన్నందువల్ల... ఇప్పుడు ఆమెను తొలగిస్తే.. తాను ఏ పదవీ తీసుకోలేదు అని చెప్పే పవన్ కల్యాణ్.. ఆమెకు పదవి ఇప్పించుకున్నారనే సంగతి ప్రజలకు అర్థమవుతుందని.. ఆ రకంగా ఆయనను బద్నాం చేయవచ్చునని భావిస్తున్నారట.

తెదేపా వారి లెక్కల్లో ఇదే టిట్ ఫర్ టాట్ అన్నమాట.