cloudfront

Advertisement


Home > Politics - Gossip

టాప్ గేర్ ‘పవన్ చంద్ర’ వార్: నష్టమెవరికి?

టాప్ గేర్ ‘పవన్ చంద్ర’ వార్: నష్టమెవరికి?

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య వార్ టాప్ గేర్ కు చేరుకుంది. ఇంతలోనే ఎంత తేడా? కేవలం నాలుగేళ్ల కిందట పవన్ కల్యాణ్–చంద్రబాబునాయుడును నెత్తిన పెట్టుకుని మోశారు. సుమారు నాలుగు నెలల కిందటి వరకు.. ‘చంద్రబాబునాయుడు గారి నాయకత్వం, ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం’ అంటూ కీర్తించారు. అంతలోనే పరిస్థితులు మారిపోయాయి.

మామూలుగా మారడం కాదు.. ఘోరంగా మారిపోయాయి. చంద్రబాబునాయుడు ప్రభుత్వ అవినీతిని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అప్పుడే వార్ మొదలైంది.. ఇప్పుడు తాజా పరిణామాలతో వార్ టాప్ గేర్ కు చేరుకుంది. చంద్రబాబు అవినీతి మాత్రమే కాదు.. బాబు ఖాన్ దాన్ మొత్తాన్నీ పవన్ ఎండగట్టే పరిస్థితి వచ్చేసింది.

నష్టమెవరికి?

పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడు మధ్య యుద్ధం జరుగుతోంటే.. విజేతగా నిలిచేదెవరు? అనేది ఇప్పట్లో తేలే సంగతి కాదు. కాకపోతే.. ఎవరో ఒకరికి నష్టం వాటిల్లడం మాత్రం గ్యారంటీ. ఈ యుద్ధంలో నష్టపోయేది ఎవరు? దీనిని ఊహించడం చాలా సులభం. ఏది ఎలా జరిగినా.. నష్టం మాత్రం చంద్రబాబుకే వాటిల్లుతుంది.

ఎందుకంటే...

పవన్ కల్యాణ్ యుద్ధం చేయడానికి సిద్ధపడే రాజకీయంలోకి వచ్చాడు. బహుశా ఆయన తన యుద్ధం చంద్రబాబుకు వ్యతిరేకంగా చేయాల్సి వస్తుందని తొలిరోజుల్లో ఊహించి ఉండకపోవచ్చు. కానీ పరిస్థితులు అలా వచ్చాయి. పవన్ తన మాటల్లో.. తాను యుద్ధానికి కాదు కదా.. చావడానికైనా సిద్ధపడే వచ్చానని చెబుతూ ఉన్నారు.

ఆయనకు జరిగే నష్టం ఏదో ఇప్పటికే జరిగింది. సినిమాలు దాదాపు పూర్తిగా మానుకున్నారు. ఇక మిగిలిందెల్లా చంద్రబాబునాయుడు పక్షం. ఆయన చేతిలో అధికారం ఉంది. కేవలం 2-3 శాతం ఓట్ల తేడాతో ఆయన గత ఎన్నికల్లో అధికార పీఠం మీదికి వచ్చారు. ఇప్పుడు పవన్ తో సున్నం పెట్టుకుని.. ఆయన తీవ్రమైన దాడిని ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో ఏ చిన్న నష్టం జరిగినా అది చంద్రబాబుకే జరుగుతుంది. పవన్ అభిమానులకు – పవన్ ను సీఎం చేసేంత బలం ఉండకపోవచ్చు.

కానీ.. చంద్రబాబునాయుడును పదవీచ్యుతుడిని చేసేంత బలం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. పైగా పవన్ దాడిలో అవినీతి మరకలు పడి చంద్రబాబు సర్కార్ కాస్త భ్రష్టు పడితే.. పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలు, కుటుంబం మీద దాడిచేయడంతో చంద్రబాబు సర్కార్ లేదా ఆయన కోటరీ దారుణంగా తప్పులు చేసింది. ఆరకంగా అనుచరులు తమ్ముళ్లు పచ్చ కోటరీ మొత్తం కలిసి.. చంద్రబాబు ప్రభుత్వానికి గోతిని తవ్వుతున్నట్లుగా ప్రస్తుత వాతావరణం కనిపిస్తోంది.