cloudfront

Advertisement


Home > Politics - Gossip

ప్లేటు మార్చిన పవన్?

ప్లేటు మార్చిన పవన్?

ఫలానా రోజున తెలంగాణ ఎన్నికల్లో జనసేన మద్దతు ఎవరికో చెబుతా అంటూ ముందే ఫ్రకటించారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్. సహజంగానే గుసగుసలు వినిపించడం ప్రారంభించాయి. ఇవన్నీ చాలావరకు పవన్ మద్దతు కేసిఆర్ పార్టీ అయిన టీఆర్ఎస్ కే అని వినిపించాయి. రాజకీయ వర్గాలు కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో వున్నాయి.

ఆంధ్రలో చంద్రబాబుతో స్నేహం చేస్తున్నట్లు, తెలంగాణలో కెసిఆర్ తో స్నేహం అన్నదే పవన్ గత నాలుగేళ్లుగా పాటించిన పద్దతి. ఇప్పుడు కూడా చంద్రబాబు వైపే పవన్ మొగ్గుతున్నట్లు ఆయన ప్రసంగాలు, వైఖరి గమనిస్తుంటే తెలుస్తోంది. కానీ ఆ విషయం బయటపెట్టడం ఇష్టంలేదు. మహాకూటమికి మద్దతు ఇస్తే ఆ విషయం బయటపడిపోతుంది.

అదీకాక కాంగ్రెస్ అంటే పవన్ కు కిట్టదు. చిరంజీవి కాంగ్రెస్ లో చేరడం కూడా పవన్ కు నచ్చని విషయం అని గతంలో అనేకసార్లు వార్తలు వినిపించాయి. అందువల్ల కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమికి ఎలా మద్దతు ఇస్తారు? అందుకే టీఆర్ఎస్ కు అనుకూలంగా పవన్ ప్రకటన చేస్తారని జనాలు ఓ అంచనాకు వచ్చారు.

కానీ పవన్ ఎప్పటిలా, అర్థం అయినట్లు, కానట్లు, ఇచ్చిన సలహా ఆచరణ సాధ్యం అయ్యేటట్లు, కానట్లు ఓ ప్రకటన ఇచ్చారు. ఎవరైతే తక్కువ అవినీతితో, ఎక్కువ పారదర్శకతతో పాలన సాగిస్తారో వాళ్లకు ఓటేయాలన్నది పవన్ పిలుపు. మరి ఇంతకీ ఇక్కడ జనాలు అంచనా వేయాలి అంటే కేసిఆర్-చంద్రబాబులనే అంచనా వేసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో లేదు కదా?

ఇంతకీ పవన్ దృష్టిలో కేసిఆర్-చంద్రబాబులో ఎవరిది తక్కువ అవినీతి? ఇసుక తినేస్తున్నాడు లోకేష్, కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నాడు అని పవన్ పదే పదే జనాల్లో చెబుతూవస్తున్నారు. అనంతపురంలో లోకేష్ పేరిట ఇసుక ర్యాంప్ కూడా వుందని చెప్పారు. ఇలా పదే పదే లోకేష్ అవినీతిని ప్రస్తావిస్తున్నాడు. మరి ఆ లెక్కన కేసిఆర్ తక్కువ అవినీతి పరుడు అని అనుకోవాలా?

లేదా పారదర్శకత అంటే మళ్లీ చంద్రబాబు ముందుకు వస్తారు? ఈ విషయంలో కేసిఆర్ హడావుడి, హంగామా అస్సలులేదు. కానీ బాబుగారు మాత్రం రియల్ టైమ్ గవర్నెన్స్, ఇంకా రకరకాల పదాలు వాడి అంతా పారదర్శకంగా వుందని అంటూ వుంటారు. మరి ఆ లెక్కన పవన్ మద్దతు చంద్రబాబుకు అనుకొవాలా?

ఇవన్నీ ఇలావుంటే, అసలు పవన్ నేరుగా టీఆర్ఎస్ కు మద్దతు తెలుపుదాం అనుకున్నారని, ఎప్పుడు అయితే లగడపాటి సర్వే బయటకు వచ్చిందో? అనవసరంగా టీఆర్ఎస్ కు మద్దతుపలికి ఇజ్జత్ పోగొట్టుకున్నట్లు అవుతుందని, లాస్ట్ మినిట్ లో ఇలా 'గోపీ' టైపు స్టేట్ మెంట్ వదిలారని టాక్ వినిపిస్తోంది. 

అది లోకేష్ కెరీర్ కు మరింత మైనస్ కాదా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్