cloudfront

Advertisement


Home > Politics - Gossip

సూపర్ స్టార్ Vs పవర్ స్టార్.. ఎవరు గొప్ప?

సూపర్ స్టార్ Vs పవర్ స్టార్.. ఎవరు గొప్ప?

సూపర్ స్టార్ రజనీకాంత్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వీరిద్దరి మధ్య ఒక పోలిక ఉంది. అదే ఫ్యాన్ ఫాలోయింగ్. అభిమానులు వీళ్లంటే వెర్రెక్కిపోతారు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా అభిమాన ధనం వీరికి తగ్గిందే లేదు. సౌతిండియాలో ఆ రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు వీరిద్దరూ.

స్వయం కృషితో పైకెదిగిన హీరో రజనీకాంత్ అయితే, అన్నచాటు తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చి ఆ అన్ననే మించిపోయాడనిపించుకున్నాడు పవన్. సింప్లిసిటీ ఇద్దరిలో కామన్ పాయింట్. అలాంటి రజనీ, పవన్ రాజకీయ రంగప్రవేశం మాత్రం పూర్తి భిన్నంగా సాగుతోంది.

ఓటమి ఎదురవుతుందని తెలిసినా ప్రయత్నం చేసేవాడే ఎప్పటికైనా గొప్పవాడవుతాడు, ఓటమికి భయపడి అసలు ప్రయత్నమే చేయకుండా ఉండేవాడిని పిరికివాడంటారు. అన్నకి ఎదురైన చేదు అనుభవం వెంటాడుతున్నా పవన్ కల్యాణ్ మాత్రం రాజకీయ రణరంగంలో దూకడానికి వెనకాడలేదు. సినిమా కెరీర్ ని కూడా పూర్తిగా పక్కనపెట్టేసి రాజకీయాల్లోకి వచ్చాడు. గెలిచినా ఓడినా జనాల్లోనే ఉంటానంటూ నమ్మకంగా చెబుతున్నాడు.

మరోవైపు రజనీకాంత్ మాత్రం రాజకీయాలపై రోజుకో మాట మారుస్తూ అభిమానుల్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అభిమానులతో మీటింగ్ లు పెడతారు, అదిగో వస్తున్నా, ఇదిగో వస్తున్నానంటారు. తీరా ఎన్నికలు దగ్గరకొచ్చే సరికి తుస్సుమనిపిస్తారు. సరిగ్గా ఈ ఏడాది కూడా అదే జరిగింది. లోక్ సభ ఎన్నికల బరిలో దిగలేనంటూ చేతులెత్తేశారు రజనీ.

పవన్ కల్యాణ్ దీనికి పూర్తిగా భిన్నం. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నాడు జనసేనాని. 2014లో టీడీపీతో చేతులు కలిపి తప్పు చేసిన పవన్, ఈసారి సరిదిద్దుకునే అవకాశమివ్వండి అని ప్రజల దగ్గరకు వెళ్తున్నాడు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ శూన్యత లేకపోయినా మూడో ప్రత్యామ్నాయాన్ని కల్పించేందుకు తెగ కష్టపడుతున్నాడు.

మరోవైపు తమిళనాడు పాలిటిక్స్ లో కావల్సినంత గ్యాప్ ఉంది. రెండు దిగ్గజాలు రెండేళ్ల వ్యవధిలోనే కన్నుమూశాయి. అన్నాడీఎంకే చుక్కానిలేని నావ, డీఎంకేలో స్టాలిన్ వ్యతిరేక వర్గం పావులు కదుపుతోంది. రజనీ రాజకీయ అరంగేట్రానికి సరైన సమయం ఇదే. ఓవైపు బీజేపీ రాయబారాలు పంపుతున్నా బాబాలా చలించకుండా ఉండిపోయారు. కబాలిలా కదం తొక్కేందుకు రజనీకి ధైర్యం సరిపోవడం లేదు.

ప్రజలు, అభిమానులు తననుంచి ఏదో కోరుకుంటున్నారని తెలిసి కూడా వెనకడుగేస్తున్నారు సూపర్ స్టార్. అధికారం అందని ద్రాక్ష అని తెలుస్తున్నా.. జనం కోసం ఏదో చేస్తానంటూ ముందుకొస్తున్నాడు పవన్ కల్యాణ్. వీరిద్దరిలో ఎవరు నిజమైన స్టార్? ఎవరు రియల్ హీరో?

ముఖ్యమంత్రి పదవి విలువనే దిగజార్చలేదా?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?