cloudfront

Advertisement


Home > Politics - Gossip

బాబుకు చిక్కుముడి, టీడీపీలో చిచ్చు!

బాబుకు చిక్కుముడి, టీడీపీలో చిచ్చు!

ఎన్నికల వేళ ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం రాజకీయాలు పసందుగా మారాయి. పక్కవారి పసందుగా.. తెలుగుదేశం వారికి తలనొప్పిగా మారాయి అక్కడ పరిణామాలు! అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు నాయుడు వేస్తున్న లెక్కలు గారడీని తలపింపజేస్తున్నాయి. వాళ్లను ఇక్కడ అయితే, వీళ్లను అక్కడ.. వీళ్లను అక్కడ అయితే.. వాళ్లను ఇక్కడ అన్నట్టుగా.. చదరంగంలో పావులను మార్చినట్టుగా ఇక్కడ అభ్యర్థులను చంద్రబాబు నాయుడు మార్చేస్తూ ఉన్నారు!

-ముందుగా చీరాలలో ఆమంచి పార్టీని వీడగానే.. అక్కడకు కరణం బలరాంను పంపించారు. అయితే ఆర్థిక కారణాలతో ఇప్పుడు బలరాం విషయంలో బాబు ఆలోచనలో పడ్డారట!

-కనిగిరి టికెట్ సంగతి సరేసరి. ఇక్కడ నుంచి బాబూరావు పట్టుపడుతూ ఉన్నారు. బాబేమో ఉగ్రనరసింహారెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. మామూలుగా అయితే ఈ వ్యవహారం తేలిపోయేదే. అయితే బాబూరావుకు బాలయ్య అండ ఉండటంతో కథ మారుతోంది!

-బాబూరావుకు కనిగిరి ఓకే చేసేసి, ఉగ్రనరసింహారెడ్డిని దర్శికి పంపించాలని అనేది బాబు ఆలోచనట. అయితే ఆయన మాత్రం అందుకు ససేమేరా అంటున్నారని టాక్.

-ఇక ఒంగోలు ఎంపీ సీటు బాబుకు తలనొప్పిగా మారింది. ఇక్కడ నుంచి మాగుంటను అనుకున్నారు. ఆయన హ్యాండించారు. ఆ తర్వాత నెల్లూరుజిల్లా కావలిలో అభ్యర్థిత్వం ఖరారు అయిన బీద మస్తాన్ రావును అభ్యర్థిగా తెచ్చే ప్రయత్నం జరిగింది.

-అయితే ఒంగోలు ఎంపీ సీటు కోసం కావలిని వదిలే ప్రసక్తి లేదని బీద మస్తాన్ రావు స్పష్టంచేశారట. ఆ తర్వాత దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి శిద్ధా రాఘవరావును ఒంగోలు బరిలోకి దించాలని బాబు  అనుకున్నారట.

-అందుకు సంబంధించి పంచాయితీ కొనసాగుతూ ఉంది. దర్శి నుంచి శిద్ధాను తప్పించి ఒంగోలుకు మార్చి, దర్శి నుంచి ఉగ్ర నరసింహారెడ్డిని పోటీచేయించి, కనిగిరిని బాబూరావుకే ఖరారు చేయాలనేది మరో ప్లాన్. అయితే ఈ ప్లాన్ పట్ల అటు శిద్ధా పెదవి విరుస్తున్నారు.

-ఎంపీగా పోటీచేసేందుకు ఆయన రెడీగాలేరు, దర్శి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి సిద్ధంగాలేరు. ఈ జిల్లాలో మొత్తం మూడు నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వాలు తేల్చడమే చంద్రబాబుకు చిక్కుముడిగా మారినట్టుగా ఉంది!

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

అనంత వైసీపీలో అప్పుడే మంత్రి పదవుల లొల్లి!