cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

ప్రవాసాంధ్రుల కుల‌గ‌జ్జికి అంతులేదా..

ప్రవాసాంధ్రుల కుల‌గ‌జ్జికి అంతులేదా..

ఎన్నని చెప్పను..ఏమ‌ని చెప్పను..మ‌న వాళ్ల కుల‌పిచ్చి.. అభిమానం.. వెర్రి.. గురించి చెప్పుకుంటూ పోతే భార‌త‌, భాగ‌వ‌తాల కంటే పెద్ద పుర‌ణాలే రాయొచ్చు.

ఏదేశ మేగినా ఎందు కాలిడినా పొగ‌డ‌రా నీ త‌ల్లి భూమి భార‌తిని..... నిల‌ప‌రా నీ జాతి నిండు గౌర‌వాన్ని అన్న రాయ‌ప్రోలు ప్రస్తుతం ప్రవాసాంధ్రుల ప్రవ‌ర్తిస్తున్న తీరు చూస్తే వీరికేనా నేను ఈ భాషితాలు చెప్పింద‌ని బాధ‌ప‌డ‌తాడేమో.. మినీ ప్రపంచంగా భావించే అవ‌గాశాల గ‌ని అమెరికా వెళ్లినా..అక్కడి విశాల భావాలు ఏమాత్రం వంట బ‌ట్టని మ‌న తెలుగు ప్రబుద్దులు కొంద‌రు కుల పిచ్చితో జాతి ప‌రువును మంట‌గ‌లుపుతున్నార‌ని పెద్దలు తీవ్ర ఆవేద‌న చెందుతున్నారు.

అమెరికాలో మ‌న‌వారి కుల‌గ‌జ్జి గురించి చ‌ల‌న‌చిత్ర రంగ ప్రముఖులు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ తాజాగా చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

తాము చ‌ద‌వుకునే రోజుల్లో అమెరికా వెళ్లడమంటే చాలా క‌ష్టమ‌ని, అయినా ఎన్నో క‌ష్టనష్టాల కోర్చి అయిన వారిని వ‌దిలి అమెరికా దాకా వెళ్లి క‌ష్టప‌డే వారు కాబ‌ట్టి ప్రసావ ఆంధ్రుడంటే చాలా గౌర‌వ‌ముండేద‌ని, అప్పట్లో అమెరికాలో ఉండే తెలుగువారంతా ఒక కుటుంబంలా మెలిగేవారని ఆయ‌న గుర్తుచేసుకున్నారు.

అయితే పోనుపోనూ అమెరికా వెళ్లడం అన‌కాప‌ల్లి వెళ్లినంత తేలిక కావ‌డంతో ప‌నికిమాలిన బ్యాచ్ అంతా అమెరికాలో త‌యారై చివ‌ర‌కు ప్రవాస ఆంధ్రుడు అంటే అస‌హ్యించుకునే స్థితికి తెచ్చేశారని బ‌ర‌ధ్వాజ ధ్వజ‌మెత్తారు.

రాజ‌కీయ నాయ‌కుల‌కు ర్యాలీలు..పార్టీ జెండాలు అమెరికాలో ఎగ‌రేయ‌డం..అభిమాన హీరోల ర్యాలీలు, జ‌య‌జ‌య ధ్వానాలు చిరాకు పుట్టిస్తున్నాయి. కుల రాజ‌కీయాలు చేస్తూ కుళ్లు కంపు కొట్టిస్తున్నారు. రాజకీయ కంపు, సినిమా కంపు, కుల‌గ‌జ్జి తో అమెరికాలో కూడా ద‌రిద్రం ప‌ట్టిస్తున్నారు అంటూ చెడామ‌డా వాయించారు.

అయితే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడి అమెరికా ప‌ర్యట‌న‌లో ఈ కుల‌పిచ్చి ప‌తాక స్థాయికి చేరింద‌ని ప్రవాసాంధ్రులు కొంద‌రి ద్వారా తెలుస్తోంది.

బాబు చుట్టూ ఒక సామాజిక వ‌ర్గం చేరి ..ముఖ్యమంత్రి ప‌ర్యట‌న‌ను అదేదో త‌మ‌కు మాత్రమే చెందిన విష‌యంగా మార్చేశారు. దీంతో చాలా మంది ఇత‌ర వ‌ర్గాలు బాబు ప‌ర్యట‌న‌కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి జుగుప్సాక‌ర కుల‌రాజ‌కీయాలు ఇక‌నైనా ప‌క్కన పెట్టి తెలుగు వారంతా క‌లివిడిగా ఉండాల‌ని పెద్దలు ఆకాంక్షిస్తున్నారు.

స‌రే మాకు అల‌వాట‌యిపోయింది మేమిక మారం అంటారా ..అయితే మీ చావు మీరు చావండి త‌ప్ప తెలుగు వాళ్లమ‌ని చెప్పుకుని మా ప‌రువు తీయొద్దంటూ వారు కోరుతున్నారు.