cloudfront

Advertisement


Home > Politics - Gossip

శివగామిని డైరెక్ట్ చేస్తున్న ప్రవీణ్ సత్తారు!

శివగామిని డైరెక్ట్ చేస్తున్న ప్రవీణ్ సత్తారు!

ది రైజ్ ఆఫ్ శివగామి పేరిట రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారిగా వెబ్ సిరీస్ ఒకటి తెలుగులో రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి చిత్రానికి ప్రీక్వెల్ గా ఈ ‘రైజ్ ఆఫ్ శివగామి’ వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు. దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం వెబ్ సిరీస్ కు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కాగా, రాజమౌళి  దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్స్ కు గరుడవేగ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. కొన్ని ఎపిసోడ్ ల తర్వాత మిగిలిన వాటికి ప్రస్థానం ఫేం దేవకట్టా దర్శకత్వంలో జరగనున్నట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను కూడా దాదాపు వందకోట్ల రూపాయల బడ్జెట్ తో చాలా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి సెల్యులాయిడ్ చిత్రాల కోసం వేసిన సెట్స్ ను యథాతథంగా వాడుకుంటూనే అంతకు ముందు కథను వివరించడానికి అవసరమైన మరికొన్ని సెట్స్ కూడా రూపొందించబోతున్నట్లు ఇదివరలోనే ప్రకటించారు.

బాహుబలి2 చిత్రాలలోనూ కనిపించిన కథ కాకుండా, అంతకంటే ముందు మాహిష్మతి రాజ్యంలో ఏం జరిగింది ? శివగామి రాజమాత స్థానానికి ఏవిధంగా చేరుకోగలిగారు అనే విషయాలు ఈ రైజ్ ఆఫ్ శివగామి అనే వెబ్ సిరీస్ లో ప్రధాన అంశాలుగా ఉంటాయి. రమ్యకృష్ణ శివగామి పాత్రలోనే ఉంటారు. అయితే ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో షూటింగ్ అవుతున్న ఎపిసోడ్స్ లో రమ్యకృష్ణ చేస్తున్నారా.. ఆమె పాత్ర ఎంటర్ కావడానికంటే ముందు ఎపిసోడ్స్ చేస్తున్నారా? అనే సంగతి మాత్రం తెలియడం లేదు.