cloudfront

Advertisement


Home > Politics - Gossip

రాజకీయాల్లోకి జేడీ లక్ష్మీనారాయణ?

రాజకీయాల్లోకి జేడీ లక్ష్మీనారాయణ?

ఒకపక్క హోదా వార్తలు, పార్టీల పోటా పోటీ పోరు ఎన్నికల వాతావరణానికి తలపిస్తుంటే, మరో పక్క సంచలన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సీబీఐ జాయింట్ డైరక్టర్ గా పనిచేసి, ఆంధ్రలో దాదాపు ప్రతి ఒక్కరికి పరిచయం అయిపోయిన పేరు లక్ష్మీనారాయణది. వైకాపా అధినేత వైఎస్ జగన్ పై పడిన కేసులను విచారించడం, ఆ సమయంలో ఆయనపై పలు విమర్శలు, మద్దతులు రావడం తెలిసిందే.

నికార్సయిన అధికారిగా ఆయనను ప్రొజెక్ట్ చేయడానికి తెలుగదేశం మద్దతుదారులు ప్రయత్నించిన విషయం గుర్తుండే వుంటుంది. ఆ తరువాత ఆయన మహరాష్ట్రలోని తన స్వంత కేడర్ కు వెళ్లిపోయారు. ఆ తరువాత ఆయన పేరు పెద్దగా వినిపించడం మానేసింది.

ఇప్పుడు వున్నట్లుండి మళ్లీ గ్యాసిప్ లు ప్రారంభయ్యాయి. లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేస్తున్నారని, త్వరలో రాజకీయాల్లోకి వస్తారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే వేటికీ కన్ఫర్మేషన్ లేదు. ఇటు అధికార వర్గాల నుంచి కానీ అటు లక్ష్మీనారాయణ సన్నిహిత వర్గాల నుంచి కానీ ధృవీకరణ లేదు. మరి వార్తలు మాత్రం హల్ చల్ చేస్తున్నాయి. నిప్పులేకుండా పొగరాదేమో?