Advertisement

Advertisement


Home > Politics - Gossip

దేశం దాటేసిన రవి ప్రకాష్?

దేశం దాటేసిన రవి ప్రకాష్?

తను పరారీ కాలేదని చెబుతూనే.. టీవీ నైన్ మాజీ సీఈవో రవి ప్రకాష్ దేశం దాటేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. తను ఏ తప్పూ చేయలేదని, తనను ఎవరూ టీవీ నైన్ సీఈవో పదవి నుంచి తప్పించలేరని, తను పరార్ కాలేదని కొన్ని రోజుల  కిందట ఇతడు టీవీ నైన్ తెర మీదే కనిపించి చెప్పుకున్నాడు. అయితే ఆ తర్వాత ఇతడు పరార్ అయ్యాడు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

ఇతడు ఏపీలో తలదాచుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో ఒక మాజీ మంత్రి ఇతడికి ఆశ్రయం ఇచ్చినట్టుగా కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా రవి ప్రకాష్ ఇప్పటికే దేశం దాటేశాడని వార్తలు వస్తున్నాయి. విదేశాల్లో తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకుంటూ ఇతడు ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడని భోగట్టా.

ఈ విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మీడియాలో మాత్రం ఈ మేరకు ప్రచారం జరుగుతూ ఉంది. తనపై నమోదు అయినవి అసలు కేసులే కాదు అని రవి ప్రకాష్ ప్రకటించుకున్నాడు. అయితే వాటి విచారణకు మాత్రం హాజరు కాలేదు. దశాబ్దంన్నర కాలంగా బోలెడన్ని నీతులు చెప్పిన ఇతడు ఆఖరికి ఇలా 420 గా విదేశాలకు పరార్ అయినట్టుగా వార్తలు వస్తూ ఉండటం గమనార్హం.

మరోవైపు రవి ప్రకాష్ తోక నటుడు శివాజీ మాత్రం గుండుతో గెటప్ మార్చి ఏవో వీడియోలు విడుదల చేస్తూ ఉన్నాడు. తనపై నమోదు అయినవి కూడా కేసులే కాదు అని అతడు చెప్పుకుంటున్నాడు. మరి అలాంటప్పుడు వచ్చి పోలీసులను కలవవచ్చు కదా.. అంటే, వడదెబ్బ, దోసెదెబ్బ అంటూ పురాణం చెబుతూ ఉన్నాడితను.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?