cloudfront

Advertisement


Home > Politics - Gossip

పవన్ పార్టీలో చీలిక.. సంక్రాంతికి ముహూర్తం?

పవన్ పార్టీలో చీలిక.. సంక్రాంతికి ముహూర్తం?

జనసేనలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆధిపత్య పోరు పెద్ద పండగకు బయట పడబోతోందా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. సంక్రాంతి నుంచి ఇంచార్జీల నియామకాలు ప్రారంభమైతే పార్టీలో అసలు రచ్చ షురూ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఓ వైపు పవర్ స్టార్ ఫ్యాన్స్, మరోవైపు జనసేన ఆవిర్భావం తర్వాత వచ్చిన నేతలు-కార్యకర్తలు, ఇంకోవైపు ఇటీవలే కొత్తగా కండువాలు కప్పుకున్న ఎన్నారైలు.. వీరంతా నియోజకవర్గ ఇంచార్జీల పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంచార్జీలను ప్రకటిస్తే దాదాపుగా వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయి. అప్పుడు ఆటోమేటిగ్గా టిక్కెట్లు ఆశిస్తున్న మిగతా అభ్యర్థుల్లో అసంతృప్తి రేగుతుంది.

ఇన్నాళ్లూ పోటీచేద్దామా వద్దా, చేస్తే ఎన్ని స్థానాల్లో చేయాలి, ఎవరితో పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తున్న పవన్ కల్యాణ్, చంద్రబాబు లవ్ ప్రపోజల్ తో బెంబేలెత్తిపోయి 175 స్థానాల్లో పోటీకి సై అన్నారు. దీంతో నియోజకవర్గ ఇంచార్జీలను ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అందుకే జిల్లాల వారీగా సమీక్షలు జరుపుతూ నాయకులపై ఓ అంచనాకు వస్తున్నారు పవన్. పండగ వరకూ సమీక్షలు, పండగ తర్వాత కమిటీలు అంటున్నారు. కమిటీలు, ఇన్ చార్జిలను ప్రకటిస్తే కచ్చితంగా జనసేనలో సునామీ మొదలైనట్టే. పదవుల కోసం చోటామోటా నేతలంతా ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్నారు.

ఇలాంటి టైమ్ లో ఎంత సామాజిక, ఆర్థిక న్యాయాలు పాటించినా అలకలు కామన్. ఇప్పటివరకూ ఎవరికీ పదవులు లేవు కాబట్టి జనసేనలో అంతా ప్రశాంతంగానే ఉంది. ఇప్పుడు అధికారాలు అప్పగిస్తున్నారు కాబట్టి కచ్చితంగా గొడవలు మొదలవుతాయనే అంచనాలున్నాయి.

అందుకే తెలివిగా పండగలోపు స్వల్ప కాలిక కమిటీలు అని ప్రకటించారు పవన్. కమిటీల్లో మార్పులు చేర్పులు ఉంటాయని చెబుతున్నారు. ఎంత సర్దుబాటు చేయాలని చూసినా పవన్ ఇప్పుడు బోర్డర్ కి వచ్చేశారు. కమిటీల కల్లోలాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఆసన్నమైంది.

ఓపిక ఉండాలి, దశాబ్దాల పాటు వేచిచూడాలి, ఏళ్ల తరబడి పార్టీకి పనిచేయాలి అంటూ నీతి వాక్యాలు చెబుతున్న పవన్ కి కార్యకర్తలు వాటిని ఎంతమేర అర్థంచేసుకున్నారో ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది. 

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?

టికెట్ దక్కకపోతే డబ్బులు మిగులుతాయ్!