cloudfront

Advertisement


Home > Politics - Gossip

మహాకూటమి.. సంచి లాభం చిల్లు దొబ్బుతోంది!

మహాకూటమి.. సంచి లాభం చిల్లు దొబ్బుతోంది!

ఎద్దులో వచ్చిన లాభం ఎక్కడో పోయిందనేది ఒక ముతక సామెత.. కాస్త పాలిష్డ్ గా చెప్పాలంటే సంచిలాభం చిల్లు దొబ్బుతోంది! ఇదీ తెలంగాణలో మహాకూటమి పరిస్థితి. భారీ స్థాయిలో రెబల్స్ రంగంలోకి దిగుతూ ఉన్నారు. నామినేషన్లకు సోమవారం తుది గడువు. కాంగ్రెస్ పార్టీ లో ఇప్పటికీ అభ్యర్థుల వ్యవహారాలు ఫైనలైజ్ కాలేదు. మరీ నామినేషన్లకు తుది గడువు రోజున కాంగ్రెస్ అభ్యర్థులను ఫైనలైజ్ చేసి.. క్యాడర్ కు ఎలాంటి సంకేతాలు పంపుతోంది అనేది గమనించాల్సిన అంశం.

అంతజేసినా.. ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తులు, అసహన వాదులు తప్పడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థులు, మహాకూటమిలోని ఇతర పార్టీల్లో ఖరారు అయిన అభ్యర్థులు ఇంకా నామినేషన్లు వేశారో లేదో కానీ.. రెబల్స్ మాత్రం తమ వంతుగా నామినేషన్లు వేసే ఉంచారు. వస్తే పార్టీ బీ ఫారం వస్తుంది. లేకపోతే.. ఇండిపెండెంట్ గా నిలుస్తామని.. చాలా మంది నామినేషన్లు వేసే ఉంచారు.

ఒకటని కాదు.. ఈ రాజకీయంలో రెబట్స్ రచ్చ  మామూలుగా లేదు. రేపటితో వీళ్ల కథ చాలా వరకూ క్లారిటీ వస్తుంది. అంతమంగా.. నలభై నియోజకవర్గాల్లో మహాకూటమికి చుక్కలు చూపించే రెబల్స్ రంగంలో ఉంటారని ఒక అంచనా. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ దాదాపు పాతిక సీట్లను కూటమిలోని పార్టీలకు ఇచ్చింది. ఈ సీట్లలో రెబట్స్ కొంతమంది కాగా.. కాంగ్రెస్ పార్టీలోనే టికెట్ దక్కని రెబల్స్ మరికొంతమంది. వీరిలో అల్లాటప్పా నేతలే కాదు.. మొన్నటివరకూ సదరు నియోజకవర్గానికి ఇన్ చార్జిగా వ్యవహరించిన వాళ్లున్నారు. 

కూటమిగా చేతులు కలపవడం వల్ల ఓట్లు ప్లస్ అవుతాయో కావో కానీ.. రెబల్స్ మాత్రం.. తమ వంతు ఓట్లను చీల్చి.. కాంగ్రెస్ కు చుక్కలు  చూపించేలా ఉన్నారు.