Advertisement

Advertisement


Home > Politics - Gossip

రెబల్స్ పై చేతులెత్తిన ఎమ్మెల్యేలు

రెబల్స్ పై చేతులెత్తిన ఎమ్మెల్యేలు

పంచాయతీ ఎన్నికలకు సంబంధించినంత వరకు ఉత్తరాంధ్రలో చాలా చోట్ల చిత్రమైన పరిస్థితి వుంది. వైకాపా ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. 

వైకాపా లో ప్రతి చోటా రెండు వర్గాలు వున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన వారు. వేరే పార్టీల నుంచి వచ్చి ఎప్పటికైనా మళ్లీ తమకు అవకాశం వస్తుందని తమ వర్గాలను కాపాడుకుంటూ వస్తున్నవారు. 

దీంతో ఇటు ఎమ్మెల్యే వర్గం నుంచి అటు పార్టీలోనే వున్న పోటీ నాయకుల నుంచి కూడా అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. దిగడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఎవరు గెలిచినా వైకాపానే కదా అని ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారు. ఇలా లైట్ తీసుకోకపోతే ఇప్పడు పనులు మానుకుని పంచాయతీలు చేసుకుంటూ కూర్చోవాలి. 

ఇరు వర్గాల్లో ఒక వర్గానికి దన్నుగా వుంటే పార్టీలో వున్న నాయకులతో తలకాయనొప్పి. పంతాలు పట్టింపులు వస్తాయి. అంతకన్నా అలా వదిలేస్తే ఎవరు గెలిస్తే వాళ్లే తమ దగ్గరకు వస్తారు. కానీ దీని వల్ల పార్టీ తరపున నేరుగా కాకున్నా, పార్టీ నుంచి నిల్చున్నవారి విజయావకాశాలు పోతాయన్న చింత ఎమ్మెల్యేలకు వున్నట్లు కనిపించడం లేదు.

'దేశా'నికి అవకాశం

ఈ పరిస్థితిని తెలుగుదేశం పార్టీ తమకు అవకాశంగా మార్చుకుంటోంది. నిజానికి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీకి జనాలు పెద్దగా ముందుకు రావడం లేదు. ఎందుకంటే గెలిచినా కాంట్రాక్టు పనులు రాకుంటే ఇప్పుడు డబ్బులు ఖర్చుచేసి వృధా అవుతుంది. 

ఎమ్మెల్యే చెప్పకుండా కాంట్రాక్టు పనులు రావు. అందుకే పోటీకి చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి జనాలు కరువవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో వైకాపా రెబల్స్ ను ప్రోత్సహించం, వైకాపా నుంచి రెబల్స్ పోటీలోవుండేలా చేయడం, వారికి తమ పార్టీ మద్దతు ఇవ్వడం వంటి వ్యూహాలు పన్నుతున్నారు. 

గెలిచిన రెబల్ ను తమ ఖాతాలో వేసుకునే అవకాశం ఆ విధంగా అందిపుచ్చుకుంటున్నారు. మొత్తం మీద వైకాపా ఎమ్మెల్యేల ఉదాసీన వైఖరి తెలుగుదేశం పార్టీకి జీవం పోస్తున్నట్లు కనిపిస్తోంది.

చంద్రబాబుకు ఏజెంట్‌లా పనిచేస్తున్న నిమ్మగడ్డ.. 

చంద్రబాబు వివరణ కోరతారా? లేక ఆ పార్టీపై వేటు వేస్తారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?