cloudfront

Advertisement


Home > Politics - Gossip

రాజకీయాల్లోకి జెనీలియా హజ్బెండ్!

రాజకీయాల్లోకి జెనీలియా హజ్బెండ్!

రామోజీరావు ఇంట్రడ్యూస్ చేసిన హీరో ఇప్పుడు లోక్ సభ ఎంపీ కావడానికి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అలా చెప్పడం కంటె.. జెనీలియా భర్త రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని చెబితే ఎక్కువ మందికి అర్థం అవుతుంది. అవును, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేసిన తన తండ్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంటూ బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

విలాస్ రావ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర రాజకీయాల్లో పట్టున్న నాయకుడు. కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో ముఖ్యనేత. 1999 నుంచి 2008 మధ్యకాలంలో  రెండుసార్లు ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2012లో అనారోగ్యంతో మరణించారు. విలాస్‌రావ్ సీఎంగా ఉన్న కాలంలోనే.. ఆయన కుమారుడు రితేశ్ ను బాలీవుడ్ హీరోగా పరిచయం చేస్తూ రామోజీరావు, విజయభాస్కర్ దర్శకత్వంలో ‘తుఝే మేరీ కసమ్’ చిత్రాన్ని నిర్మించారు.

మళయాళ చిత్రానికి రీమేక్ గా తెలుగులో వచ్చిన ‘నువ్వేకావాలి’ చిత్రానికి ఇది హిందీ రీమేక్ వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయిన రితేశ్ 2012లో అప్పటికి స్టార్ హీరోయిన్ గానే వెలుగొందుతున్న. జెనీలియాను పెళ్లిచేసుకున్నారు. అదే ఏడాదిలో తండ్రి విలాస్ రావ్ మరణించారు. అయితే, రెండేళ్ల కిందట రితేశ్ ఓ సందర్భంలో తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని వెల్లడించారు.

కాకపోతే ఇప్పుడు, కాంగ్రెస్ పార్టీ అవసరాల దృష్ట్యా ఆయన ఎంపీగా బరిలోకి దిగుతారని వార్తలు వస్తున్నాయి. తండ్రి ప్రాతినిధ్యం వహించిన లాతూర్ నియోజకవర్గం నుంచే రితేశ్ కూడా 2019లో బరిలో ఉంటారని తెలుస్తోంది. ఇక స్వయంగా భర్త బరిలో ఉంటున్నాడు గనుక.. జెనీలియా కూడా ప్రచారానికి వెళ్లేట్లయితే.. బహుశా తెలుగులో ఆమెకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రచారానికి వినియోగిస్తుందని ఊహించొచ్చు.