Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఆర్ఆర్ఆర్..చేసింది కరెక్ట్ యేనా?

ఆర్ఆర్ఆర్..చేసింది కరెక్ట్ యేనా?

ఆర్మీ ఆసుపత్రి నుంచి ఇలా డిశ్ఛార్జి కాగానే అలా ప్రయివేటు ఫ్లయిట్ లో ఢిల్లీ వెళ్లిపోయారు ఎంపీ రఘురామరాజు. ఇక్కడ వుంటే మళ్లీ ఏదో కేసులో అరెస్ట్ చేస్తారన్న భయమో? లేక సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం కింది కోర్టులో బాండ్లు ఇంకా ఇతర ఫార్మాలిటీలు పూర్తి చేసుకుని బెయిల్ పొందాల్సిన అవసరం వుంది. ఈ ఫార్మాలిటీలోగా మళ్లీ జైలుకు పంపిస్తారని, ప్రభుత్వ వ్యతిరేక మీడియా కోడై కూసింది. ఆ భయంతో వెళ్లిపోయారా?

అసలు పద్దతిగా చూసుకుంటే, ఏ నిందితుడు అయినా విడుదల కావాలంటే బెయిల్ ఫార్మాలిటీలు పూర్తి కావాలి. బెయిల్ ఆర్డర్ రావాలి. అప్పుడు దాన్ని జైలు అధికారులకు ఇస్తే విడుదల చేస్తారు. లేదా ఆసుపత్రిలో వుంటే కనుక, అక్కడి నుంచి విడుదలచేస్తారు. కానీ రఘురామ్ ది చిత్రమైన వ్యవహారం.

సుప్రీం కోర్టు ఏం చెప్పింది? ఆర్మీ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ చేయాలి. కోర్టులో బెయిల్ ఫార్మాలిటీలు పూర్తి చేయాలి. కానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావడానికి బెయిల్ ఫార్మాలిటీలు పూర్తి కావడానికి సంబంధం వుందా లేదా అన్నది క్లారిటీ లేదు. 

బెయిల్ ఫార్మాలిటీ పూర్తి కావడానికి ఆసుపత్రి డిశ్చార్జి సమ్మరీ కావాలి. అది ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యాకే వస్తుంది. అదే వ్యవహారం అలా వుండగా, రఘురామరాజు ఇలా బయటకు వచ్చి, అలా ఢిల్లీ వెళ్లిపోయారు. కామన్ మాన్ ఎవ్వరికైనా ఇలా చేయడానికి అవకాశం వుండదు. బహుశా ఇలా ఎవరైనా పాయింట్ అవుట్ చేస్తారనే కావచ్చు.

ఎయిమ్స్ లో చెకప్ కు వెళ్లారు. అంతా క్లియర్ అయిన తరువాతే కదా ఆర్మీ ఆసుపత్రి డిశ్ఛార్జి చేసింది. వాళ్లు పూర్తిగా సంతృప్తి చెందేవరకు బయటకు పంపలేదు కదా. మరి ఎయిమ్స్ కు ఎందుకు? రఘురామరాజు తన స్వంత అనుమానాలతో తన ఆరోగ్యం కోసం ఎయిమ్స్ చెకప్ కు వెళ్లారా?

ఇప్పుడు సిఐడి శాఖ‌ అధికారులు ఏం చేస్తారు? కోర్టు ఫార్మాలిటీలు ఎలాగూ పూర్తవుతాయి కనుక ఊరుకుంటారా? బెయిల్ క్యాన్సిల్ చేయాలని పిటిషన్ వేస్తాయా? మొత్తానికి లాయర్లు, లీగల్ పాయింట్లు అండగా వున్నాయని రఘురామరాజు భలే ఆటలు ఆడేస్తున్నట్లున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?