cloudfront

Advertisement


Home > Politics - Gossip

బాబు పదవిస్తానన్నా..టీడీపీకి బై!

బాబు పదవిస్తానన్నా..టీడీపీకి బై!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గిన ఇద్దరు ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గట్టిగానే ప్రయత్నిస్తూ ఉన్నట్టున్నాడు. సండ్ర, మెచ్చాలను తెలుగుదేశం వైపున నిలుపుకోవడానికి బాబు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాడు. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసిన బాబుకు.. తన పార్టీలోని ఎమ్మెల్యేలు ఫిరాయింపు చేయకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తుండటమే విచిత్రం.

23 మంది ఎమ్మెల్యేలను వైఎస్సార్సీపీ నుంచి బాబు తెచ్చుకున్నా.. జగన్ కు జరిగిన నష్టం ఏమీలేదు. ఫిరాయింపుదారులు తెలుగుదేశం పార్టీకి వైట్ ఎలిఫెంట్స్ గా మారారు. వారిలో చాలామందికి టికెట్ ఇవ్వకూడదని చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఫిక్సయ్యాడట!

మరి టికెట్ ఇస్తే ఓడిపోతారు.. అనేవాళ్లను తెచ్చుకుని బాబు ఏం సాధించినట్టు? అనేది పెద్ద డౌట్. ఏపీలో 23 ఎమ్మెల్యేలను తెచ్చుకున్నా.. తెలంగాణలో ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు జారిపోతే.. టీడీపీ జీరో అయిపోతుంది. అందుకే బాబు వారిని నిలుపుకోవడానికి రకరకాల ఆఫర్లు ఇస్తున్నట్టుగా సమాచారం.

తెలంగాణలో రాజకీయానికి ఏపీలో నామినేటెడ్ పదవులను బాబు ఉపయోగించుకుంటున్నాడట. అది కూడా టీటీడీని బాబు వాడుకుంటున్నట్టుగా సమాచారం. తెలుగుదేశాన్ని వీడవద్దని టీటీడీలో పదవులు ఇస్తామని.. సండ్ర, మెచ్చాలకు చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాడట.

ఆఖరికి టీటీడీ పదవులు ఆగతికి వచ్చాయనమాట. అయితే తెరాస నుంచి సండ్ర, మెచ్చాలకు మరింత టెంప్టింగ్ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. వాటి రేటే గట్టిగా ఉండటంతో.. ఈ ఎమ్మెల్యేలు అటువైపు వెళ్లడానికే డిసైడ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి.

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?

హరికృష్ణ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది