Advertisement

Advertisement


Home > Politics - Gossip

వణికించిన నిరసన.. శెభాష్!

వణికించిన నిరసన.. శెభాష్!

యూనివర్సిటీ విద్యార్థులకు కడుపుమండింది. తమ పరిసరాలు మొత్తం కలుషితమైన నీటితో ఎంత దుర్గంధభరితంగా తయారయ్యాయో.. తాము ఎంత అవస్థల మయమైన జీవితం గడుపుతున్నామో.. వారు ప్రపంచానికి తెలియజేయాలనుకున్నారు! వారు ఎందరికి మొరపెట్టుకుని విసిగిపోయారో ఏమో తెలియదు గానీ... ఏకంగా యావత్ రాష్ట్రం దృష్టిని తమవైపు తిప్పుకోవాలని అనుకున్నారు. అందుకు వారు చేసిన సాహసం.. ఆ లక్ష్యాన్ని నెరవేర్చినట్టే. ఇవాళ పోలీసు యంత్రాంగం ఉరుకులు పరుగులు తీయగా... అందరూ భయపడిన వ్యవహారం... వారి నిరసనగా తేలినతర్వాత.. అందరి దృష్టి వారి అవస్థల మీదకు మళ్లుతోంది.

ఈ ఉపోద్ఘాతం మొత్తం.. తెలంగాణలోని ప్రముఖులకు ఒకేరోజు పోస్టల్ ద్వారా బట్వాడా అయిన... పార్సిళ్లలోని బాటిళ్ల గురించే. ఒకేరకం ప్యాకింగ్ లో ఉన్న బాక్సుల్లో పోస్టల్ అధికారులు కొన్ని సీసాలను గుర్తించారు. వాటినుంచి అపరిమితమైన దుర్గంధం వెలువడుతోంది. వాటిపై చిరునామాలు... గవర్నరు, ముఖ్యమంత్రి, డీజీపీ, మాజీ ఎంపీ కవిత, కేటీఆర్, పోలీసు కమిషనర్, డీసీపీలు ఇలా ప్రముఖుల పేరిట ఉన్నాయి. దాంతో వారు కంగారుపడి పోలీసులకు కంప్లయింటు ఇచ్చారు.

పోలీసులు రంగంలోకి దిగి.,. ఆ బాటిళ్లకు ఫోరెన్సిక్ పరీక్షలు చేసిన తర్వాత.. అందులో ఉన్నది దుర్గంధభరితమైన మురికినీరు అని తేలింది. వారు తేలిగ్గా ఊపిరిపీల్చుకున్నారు. అంతదాకా అవి రసాయన బాంబులేమో, విషరసాయనాలేమో... అని రకరకాలుగా భయపడ్డారు. తర్వాత ఆరాతీస్తే... అవన్నీ యూనివర్సిటీ పోస్టాఫీసు నుంచి బుక్ అయినట్లు తెలిసింది. యూనివర్సిటీ విద్యార్థులే తమ పరిస్థితులను తెలియజెప్పడానికి ఇలాంటి నిరసన మార్గం ఎంచుకుని ఉండవచ్చునని అనుకుంటున్నారు.

విద్యార్థుల నిరసన మార్గాన్ని మాత్రం సెభాష్ అనాల్సిందే. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని అధికార్లు ఉన్నప్పుడు... వారి అలసత్వాన్ని పైవాళ్ల దృష్టికి తీసుకెళ్లడానికి వారు సరైన మార్గాన్నే ఎంచుకున్నారు. గతంలో ఓ సినిమాలో కూడా ఇలాంటి ఐడియాను ఎస్టాబ్లిష్ చేశారు. బహుశా విద్యార్థులు తమ సమస్య గురించి ఓ వెయ్యి లేఖలు సీఎంకు రాసినా ఇంత ప్రచారం వారికి వచ్చి ఉండేది కాదేమో... కానీ ఇవాళ వారి సమస్య యావత్ తెలంగాణ దృష్టికి తెలిసిపోయింది. అందరూ సానుభూతి చూపిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?