cloudfront

Advertisement


Home > Politics - Gossip

షర్మిళ ఫిర్యాదు.. టీడీపీలో కలకలం

షర్మిళ ఫిర్యాదు.. టీడీపీలో కలకలం

నాపై వస్తున్న దుష్ప్రచారం వెనక టీడీపీ హస్తం ఉంది, ఇది ముమ్మాటికీ నిజమంటూ జగన్ సోదరి షర్మిళ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఫిర్యాదు చేయడంతో టీడీపీ నేతలు ఒక్కొక్కరికీ చెమటలు పట్టేస్తున్నాయి. అందరికంటే ముందుగానే చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. అలాంటి తప్పుడు ప్రచారాలకు టీడీపీ దూరమంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆయన బాటలోనే వంతపాడుతున్నారు. అయితే తెలంగాణ పోలీసుల విచారణతో టీడీపీ నేతలకు వణుకు మొదలైంది. షర్మిళ ఫిర్యాదు చేసినరోజే వందలకొద్దీ వీడియోలు యూట్యూబ్ సర్వర్ నుంచి డిలీట్ అయ్యాయని తెలుస్తోంది. వెబ్ సైట్లు కూడా నష్టనివారణ చర్యలు చేపట్టాయి.

కానీ సైబర్ క్రైమ్ పోలీస్ ఐటీ విభాగం పక్కా సమాచారంతో ఇప్పటికే యూట్యూబ్ నిర్వాహకులతో సహా, 23 యూట్యూబ్ ఛానెళ్లకు, పలు వెబ్ సైట్స్ కు కూడా నోటీసులు ఇచ్చింది. ఇవన్నీ చంద్రబాబు అను'కుల' మీడియాలే అనే విషయం అందులో ఉన్న వార్తలు చూస్తే అర్థమౌతుంది. ఈ సోషల్ మీడియా సంస్థలకు ఎంతమంది టీడీపీ నేతలతో సంబంధాలున్నాయనే విషయం బయటకు రావాల్సి ఉంది.

టీడీపీ నేతలు, కార్యకర్తలకు చెందిన కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్లలో తప్పుడు రాతలు ఉన్నాయనేది వాస్తవం. ఒకరకంగా పార్టీ అధినేతల మెప్పుకోసమే వీరు ఈ పనిచేస్తూ వచ్చారు. తీరా ఇప్పుడు పోలీస్ కేసు దగ్గరకు వచ్చేసరికి పార్టీ పరువుపోతుంది కాబట్టి వీరందర్నీ బడా నేతలు దూరంగా పెడుతున్నారు.

కేసు ఏ మలుపు తిరిగి ఎవరి మీదకు వచ్చినా.. వారికి టీడీపీతో సంబంధం లేదు అని చెప్పుకోడానికి ముందే సాక్ష్యాధారాలను తయారు చేసుకుంటున్నారు బడానేతలు. ఎన్నికల సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం పార్టీకి నష్టం చేస్తుందని బాధపడుతున్నారు.

ఇప్పటికే సినీనటి అపూర్వ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ తనను మానసికంగా వేధిస్తున్నారంటూ వాపోయారు. షర్మిళ ఫిర్యాదుతో ఇప్పుడు ఈ కేసు కూడా తెరపైకి వస్తోంది.

రాజకీయ లబ్ధికోసం పక్కవారిపై బురద జల్లేందుకు, మానసికంగా హింసించేందుకు టీడీపీ నేతలు ఎంతకైనా దిగజారతారు అని ఈ కేసులే నిరూపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ పోలీసుల ఎంక్వయిరీ అనేసరికి టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. 

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది?