cloudfront

Advertisement


Home > Politics - Gossip

పోలింగ్ లేదు.. రిజల్ట్ లేదు.. చీలిక పుకార్లు!!

పోలింగ్ లేదు.. రిజల్ట్ లేదు.. చీలిక పుకార్లు!!

ఆలూలేదు చూలూలేదు కొడుకు పేరు సోమలింగం అన సామెత మనకు తెలియంది కాదు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు, ఒకరి మీద మరొకరు ఆడుతున్న మైండ్ గేమ్ లు ఆ సామెతకంటె భిన్నంగా ఎంతమాత్రమూ లేవు. ‘మేం 100 కాదు 106 గెలవబోతున్నాం అంటూ ప్రజలను నమ్మించి.. తటస్థుల ఓట్లను వేయించుకోవాలని తెరాస ఆలోచిస్తున్నట్లే.. తెరాసలో ముసలం పుట్టబోతున్నదని.. ఆ పార్టీ చీలిపోతుందని.. కాంగ్రెస్ కు మద్దతిచ్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కొన్ని పుకార్లు కూడా చెలామణీలోకి వస్తున్నాయి.

సోషల్ మీడియాలో, వాట్సప్ గ్రూపులో సర్కులేట్ అవుతున్న పుకార్లు ఈ విధంగా ఉన్నాయి.

ఫ్లాష్....ఫ్లాష్....ఫ్లాష్
డిసెంబరు 12 వతేదీన కేసీఆర్ కి/కేసీఆర్ కుటుంబానికి అత్యంత సమీప వ్యక్తి ఆధ్వర్యంలో /నాయకత్వంలో నిట్ట నిలువునా చీలనున్న తెరాస పార్టీ !. కూటమికి, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిల్వనున్న దరిదాపు కనీసం ఇరవై నుండీ ఇరవైఐదు మందితో కూడిన తెరాస మెజారిటి చీలికవర్గం ఎమ్మెల్యేలు!

తెరాస చీలికవర్గం నాయకుడికి ఉపముఖ్యమంత్రి పదవి, చీలికవర్గంలోని బీసీ వర్గానికి చెందిన మరో ప్రధాన నాయకుడికి కీలకమైన మంత్రిగా నియామకానికి కూటమి పచ్చజెండా! డిసెంబరు నెలాఖరుకు తెరాసలో ఏకాకిగా మిగలనున్న కేసీఆర్ కుటుంబంలోని కేవలం "ఆ నలుగురు"!

...ఇదీ సంగతి. పోస్టు చూస్తేనే అచ్చంగా ఇది పచ్చిపుకారు అని తెలిసిపోతూనే ఉంది. సాధారణంగా.. మొన్నమొన్నటిదాకా.. హరీశ్ రావు తెరాసను చీలుస్తాడంటూ.. కాంగ్రెస్ పార్టీ ఓ రకమైన కువిమర్శలతో మైండ్ గేమ్ ఆడుతూ వచ్చారు. ఇప్పుడు ‘కేసీఆర్ కుటుంబానికి చెందిన ఆ నలుగురు మాత్రం అక్కడే ఉంటారని’ అంటుండడంతో.. మరెవ్వరో పార్టీని చీలుస్తారన్నట్లుగా పుకారు కనిపిస్తోంది.

ఇది పుకారు మాత్రమే అనుకోవడానికి మరోకారణం కూడా ఉంది. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ కు సంఖ్యాబలం తగ్గి, 25 మంది ఎమ్మెల్యేల వరకు మద్దతు బయటినుంచి తీసుకోవాల్సి వస్తే గనుక.. ఆ చీలిక వర్గంనేత ముఖ్యమంత్రి పదవినే ఆశిస్తారు తప్ప.. డిప్యూటీసీఎం పోస్టుతో ఎందుకు సరిపెట్టుకుంటారు?

మొత్తానికి ఈ పుకారు పుట్టించిన వాళ్లు ఇలాంటి చిన్న చిన్న లాజిక్ లు కూడా మిస్సయినట్లుంది.

ఆ పార్టీకి మినిమం మెజారిటీ గ్యారెంటీ!... ఎందుకో తెలుసా?