cloudfront

Advertisement


Home > Politics - Gossip

బాబుపై రాహుల్ కు ఫిర్యాదులు.. లాభమేంటి?

బాబుపై రాహుల్ కు ఫిర్యాదులు.. లాభమేంటి?

తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు ఓడారు? అని టీ.కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ సంధించిన ప్రశ్నకు సమాధానంలో ప్రముఖంగా వినిపించిన పేరు చంద్రబాబు నాయుడు. ముందుగా ఈవీఎంల మీద నెపాన్ని నెట్టారట టీ.కాంగ్రెస్ నేతల్లో కొంతమంది. అది జనాలకు చెప్పడానికి బాగుంటుంది కానీ, రాహుల్ కు చెబితే కామెడీగా ఉంటుంది. ఆ తర్వాత డబ్బు ప్రభావం అన్నారట.

టీఆర్ఎస్ బాగా డబ్బులు పంచిందని చెప్పారట. అయితే మనం పంచాం కదా.. అనలేదట రాహుల్. మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ లలో బీజేపీ గట్టిగా డబ్బులు పంచింది కదా అన్నాడట. దీంతో ఓటమికి సారీ చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది.

ఇక మరి కొందరు నేతలు మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీగా ఎలాంటి ఉద్యమాలు చేయలేదని.. ఆ ప్రభావమే ఓటమి అని తేల్చారట. ఇంకొందరు మాత్రం చంద్రబాబు ప్రస్తావన తీసుకువచ్చారట. ఎన్నికల పోరాటం కేసీఆర్ వర్సెస్ చంద్రబాబుగా మారిందని.. ఫలితంగా ఓటమి ఎదురైందని వారు వివరించే ప్రయత్నం చేయగా.. రాహుల్ కామ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తరచూ రాహుల్ ను కలుస్తున్నాడు, శాలువా సత్కారాలు కామన్. ఇలా చంద్రబాబు చేస్తున్న సత్కారాలకు రాహుల్ ఫిదా అయిపోయినట్టుగా ఉన్నాడు. దీంతో బాబు విషయంలో రాహుల్ కూడా ఏమీ స్పందించలేకపోయాడని సమాచారం.

ఒకవైపు కాంగ్రెస్ తో దోస్తీ చేస్తూనే మరోవైపు ఏపీలో కాంగ్రెస్ నుంచి నేతలను తన వైపుకు తిప్పుకుంటున్నాడు చంద్రబాబు. అయినా బాబును ఏమీ అనలేని స్థితిలోనే ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నేతలకు చంద్రబాబు అలా వేరే రుచులు చూపిస్తున్నాడు మరి!

కీలకమైన 'పోల్‌ మేనేజిమెంట్‌' జగన్ ఎదుర్కోగలడా?