
విజయనగరం జిల్లా రామతీర్థంలో దారుణమైన దుర్ఘటన జరిగింది. హిందువుల మనోభావాలు దారుణంగా గాయపడేలాంటి పనిని ఎవరో చేసారు. ఆ ఎవరో కనిపెట్టాల్సి వుంది. అయితే ఈ ఉదంతంలో తప్పంతా ముఖ్యమంత్రి జగన్ దే. ఆయన తక్షణం గద్దె దిగిపోవాలి. ఇది మాత్రం అత్యంత సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త చంద్రబాబు డిమాండ్.
రామతీర్థం ప్రాంత ఎస్ఐ ది బాధ్యత కాదు. సిఐది అంతకన్నా కాదు. డిఎస్పీకి సంబంధమే లేదు. ఎస్పీ ఏం చేస్తారు పాపం. జగన్ ది మాత్రమే తప్పు, ఆయనను గద్దె దించేయండి.
రామతీర్థం ప్రాంత ఎమ్మెల్యే ఎవరో అనవసరం. జిల్లా మంత్రితో మాకు పేచీ పూచీ లేదు. హోమ్ మంత్రి ఎవరైతే మాకేంటీ,..తప్పంతా జగన్ దే. ఆయన ప్రభుత్వాన్ని తక్షణం గద్దె దింపేయాలి. వీలయితే జగన్ ను మళ్లీ జైలుకు పంపేయాలి.
ముదిమి మీద పడిన వేళ చంద్రబాబుకు అహరహం అధికారం కోసం ఎంతటి తాపత్రయమో? జనం తన మాటలను గమనిస్తున్నారని, తన రాజకీయాన్ని అవగాహన చేసుకుంటున్నారని ఏమాత్రం తట్టడం లేదు. ఏదో విధంగా జగన్ ను గద్దె దింపేయాలి. తప్పంతా జగన్ దే. ముమ్మాటికీ జగన్ దే. అంతే కదా?బాబుగారూ?
హిందువు అన్నవాడు, దైవ భీతి వున్నవాడు ఈ పని చేస్తాడా? లేదా జగన్ పాలనలో తమ మతం పరిఢవిల్లుతోందనే భావన వున్నవారు ఈ పని చేస్తారా?చేసి తమ అనుకూల ప్రభుత్వం అనుకుంటున్నదాన్ని ఇరుకున పెట్టుకుంటారా? మరి ఈ పని ఎవరికి అవసరం? ఎందుకు అవసరం? జనం ఆలోచిస్తున్నారు ఆ దిశగా. కానీ మన బాబుగానే అధికారం దిశగా తప్ప మరో వైపు ఆలోచనలు సాగనివ్వడం లేదు.
అవుటాఫ్ ది బాక్స్ ఆలోచించక తప్పని పరిస్థితి
ముంబై నైట్ లైఫ్ అంటే చాలా ఇష్టం
జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు
బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి