cloudfront

Advertisement


Home > Politics - Gossip

టిడిపికి బిజెపి సినిమా చూపిస్తుందా

టిడిపికి బిజెపి సినిమా చూపిస్తుందా

ఇంతకాలం తమను టిడిపి ప్రశ్నించిందని, ఇకపై తాము తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తామని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చెప్పారు.

ఎపి అబివృద్దికి అక్కడి రాజకీయ పార్టీలు ఎంత కట్టుబడి ఉన్నాయో,తాము అంత కన్నా ఎక్కువే కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. ప్రజల మనోభావాల ఆధారంగా ప్రశ్నలు లేవనెత్తే కార్యక్రమం జరుగుతోంది. దానికి సమాధానంగా అభివృద్ధి ఆధారంగా జవాబు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్దం అవుతోందని ఆయన చెప్పారు.

"తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి వైదొలగడం, అవిశ్వాసం ద్వారా తనంతట తానే తమరే వ్యతిరేకంగా నిలబడిందిని, ఇప్పటి వరకూ సీఎం చంద్రబాబు, తెదేపా నేతలు భాజపాను ప్రశ్నించారు.. రాబోయే కాలంలో మేం లేవనెత్తే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాల్సిందే’’ అని రాం మాధవ్‌ వ్యాఖ్యానించడం విశేషం.

తెలుగుదేశంకు సినిమా చూపిస్తామని రామ్ మాదవ్ చెబుతున్నారా!