cloudfront

Advertisement


Home > Politics - Gossip

టీడీపీ నేత దోపిడీపై టీడీపీలోనే లొల్లి!

టీడీపీ నేత దోపిడీపై టీడీపీలోనే లొల్లి!

రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక మంత్రిగారి అవినీతి వ్యవహారంపై సొంత పార్టీలోనే అసహనం వ్యక్తం అవుతోంది. ఆ మంత్రిగారు భారీగా దోచేసుకుంటున్నారని.. తాజాగా ఒక స్కామ్ లో ఏకంగా అరవై కోట్ల రూపాయలకు పైగా ఆయనకు కమిషన్లు అందుతున్నాయని తెలుగుదేశం నేతలు తెగ బాధపడుతున్నారు. ఈ విషయంలో వారు చంద్రబాబుకు ఫిర్యాదులు చేసినట్టుగా తెలుస్తోంది. హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి ఇప్పుడు కొత్త ‘కాలువ’లు తవ్వకం విషయంలో మంత్రిగారు చేతివాటాన్ని చూపిస్తున్నారని టాక్.

తనకు బాగా కావాల్సిన ఒక కాంట్రాక్టర్‌‌కు పనులు అప్పగించడం ద్వారా మంత్రి కమిషన్లు తీసుకుంటున్నాడట. ఈ కమిషన్లు ఇరవైశాతం అని.. తద్వారా మంత్రికి అరవైకోట్ల రూపాయలకు పైగా కమిషన్లు అందుతున్నాయని తెలుగుదేశం నేతలు అంటున్నారు. ఈ టెండర్లను ఓకే చేయించుకోవడంలో నీటి పారుదలశాఖ మంత్రి దగ్గర ఈ సీమ మంత్రి తన పలుకుబడిని ఉపయోగించుకున్నాడని.. తద్వారా అరవై కోట్ల రూపాయల వరకూ మంత్రి జేబులో వేసుకుంటున్నాడని తెలుగుదేశం నేతలు వాపోతున్నారు.

ఇలా ‘కాలువ’ల తవ్వకంలో మంత్రిగారు చేస్తున్న దోపిడీని చూసి సాటి టీడీపీ నేతలే ఓర్చలేకపోతున్నారు. ఈ విషయం గురించి మీడియాకు వారే సమాచారం అందిస్తున్నారు. తమ క్యాస్ట్ కాని మంత్రి ఇలా దోచేసుకోవడం.. ఇలా దోచేసిన సొమ్ముతో ఆయన పక్క నియోజకవర్గాల్లో తన వాళ్లను నిలబెట్టుకుని గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండటంపై అనంత టీడీపీలోని ఒకవర్గం వారు ఫైర్ అవుతున్నారు.

మంత్రి దోపిడీపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబును వీళ్లు డిమాండ్ కూడా చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఫిర్యాదులు అందాయని టాక్. ఇక్కడ వీళ్ల బాధ అవినీతి జరుగుతోందని కాదు.. తాము కాకుండా.. అతడు సంపాదించుకుంటున్నాడే అనేది.