cloudfront

Advertisement


Home > Politics - Gossip

టీడీపీకి నిరాశ మిగిల్చిన వైసీపీ నిర్ణయం

టీడీపీకి నిరాశ మిగిల్చిన వైసీపీ నిర్ణయం

రాజ్యస‌భ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక‌లో తాము ఎన్‌డీఏకు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మ‌ద్దతు తెలిపేది లేద‌ని వైసీపీ స్పష్టం చేయ‌డం అధికార టీడీపీకి తీవ్ర నిరాశ మిగిల్చింద‌నే చెప్పాలి. రాజ్యస‌భ డిప్యూటీ చైర్మన్ కురియ‌న్ ఈనెల మొద‌టివారంలో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన విష‌యం తెలిసిందే. కొత్త డిప్యూటీ చైర్మన్ ఎన్నిక‌ను అధికార ఎన్‌డీఏ, ప్రతిప‌క్ష యూపీఏ కూట‌మి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఏ కూట‌మికి కూడా స్పష్టమైన మెజార్టీలేదు. రాజ్యస‌భ స‌భ్యుల సంఖ్య 244. ఇందులో 123 మంది మ‌ద్దతున్న వారిని ప‌ద‌వి వ‌రిస్తుంది. అయితే ఎన్‌డీఏ ప‌క్షానికి 108, యూపీఏ ప‌క్షానికి 119 మంది స‌భ్యుల మ‌ద్దతు ఉంది. ఎన్‌డీఏకు 15మంది, యూపీఏకు న‌లుగురు స‌భ్యుల మ‌ద్దతు అవ‌స‌రం. బీజేడీ 9, టీఆర్ ఎస్ 6, వైసీపీ ఇద్దరు స‌భ్యులు త‌ట‌స్థంగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో వీరి మ‌ద్దతు కీల‌కంగా మారింది.

రాష్ర్టానికి ప్రత్యేకహోదా ఇవ్వని ఎన్‌డీఏకు ఎట్టి ప‌రిస్థితుల్లో మ‌ద్దతు ఇచ్చేది లేద‌ని వైసీపీనేత‌, రాజ్యస‌భ స‌భ్యుడు విజయ‌సాయిరెడ్డి ఢిల్లీలో తేల్చి చెప్పారు. వైసీపీ నిర్ణయంపై ర‌క‌ర‌కాల ఊహాగానాల‌కు విజ‌య‌సాయిరెడ్డి ఎట్టకేల‌కు తెర‌దించారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉంద‌ని వైసీపీపై బుర‌ద‌జ‌ల్లుతున్న అధికార టీడీపీకి వైసీపీ నిర్ణయం తీవ్ర నిరాశ మిగిల్సింద‌నే చెప్పాలి.

ఒక‌వేళ ఎన్‌డీఏకు వైసీపీ మ‌ద్దతు ప్రక‌టిస్తే లోపాయికారి ఒప్పందం బ‌హిరంగ‌మైంద‌ని ఆరోపిస్తూ ప్రజ‌ల్లో ఆ పార్టీని బీజేపీతో పాటు దోషిగా నిలిపి మైనార్టీల ఓట్లను కొల్లగొడుదామ‌ని ప‌థ‌క ర‌చ‌న చేసిన టీడీపీకి తాను ఆశించిన‌ట్టు జ‌ర‌గ‌క‌పోవ‌డం తీవ్ర వేద‌న క‌లిగించే అంశ‌మ‌నే చెప్పాలి. అయితే ప్రజాభీష్టానికి అనుగుణంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌ముచిత నిర్ణయం తీసుకుని ఆ పార్టీ శ్రేణుల్లో సంతోషాన్ని నింపారు.