cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఇంత చిత్రమైన కామెడీ ఆయనకే తగు!

ఇంత చిత్రమైన కామెడీ ఆయనకే తగు!

చాలా సందర్భాలలో రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థుల గురించి తలాతోకా లేకుండా చేసే కామెంట్లు వారిని నవ్వులపాలు చేసే విధంగా ఉంటాయి. ఏమాత్రం లాజిక్ కు అందకుండా పనిగట్టుకుని బురదజల్లడమే లక్ష్యంగా రాజకీయ నాయకులు సాధారణంగా మాట్లాడుతుంటారు. ఇలాంటి చిత్రమైన విమర్శలలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ సరికొత్త శైలిని ప్రదర్శిస్తున్నారు. ఇంత దారుణమైన కామెడీ తనకు మాత్రమే చేతనవుతుంది అని ఆయన నిరూపించుకుంటున్నారు.

తొలుత ప్రత్యేక హోదా కోసం అవిశ్వాసం పెట్టడం అనే అంశాన్ని తూలనాడింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత ఇక గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడినప్పుడు అనివార్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టే విశ్వాస తీర్మానానికి తాను కూడా మద్దతు ఇస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే తెల్లవారేసరికి అనూహ్యంగా యూటర్న్ తీసుకుని అవిశ్వాసం తామే ప్రతిపాదిస్తాం అంటూ రంగంలోకి వచ్చారు.

ఈ పోకడ మీద తెలుగుదేశం పార్టీ రకరకాల విమర్శలను ఎదుర్కొంది. దీని గురించి చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీ వారిని కూడా నిలదీశారు. అయితే అందుకు వివరణగా సీఎం రమేష్ చెబుతున్న భాష్యం మాత్రం చాలా చిత్రంగా కనిపిస్తోంది. వాళ్ల కంటే ముందుగానే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దాన్ని వెనక్కు తీసుకుని కేంద్రంలోని మోడీ సర్కారుకు దొంగచాటుగా సహకరించే ప్రమాదం ఉన్నదని, అలాంటి అవకాశాన్ని అడ్డుకునేందుకు తాము కూడా విడిగా అవిశ్వాస నోటీసు ఇచ్చామని సిఎం రమేష్ చెబుతున్నారు.

ఇంత కల్లబొల్లి మాటలు మరెక్కడైనా ఉంటాయా అని ప్రజలు నివ్వెరపోతున్నారు. తొలి నుంచీ అవిశ్వాస తీర్మానానికి కట్టుబడి ఉన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆ విషయంలో జగన్మోహన రెడ్డి తన పట్టుదలను, మడమ తిప్పని శైలిని నిరూపించుకుంటూనే వస్తున్నారు.

తొలి నుంచీ తీర్మానాన్ని వ్యతిరేకించి తాజాగా గతిలేక ఆ పాట పాడుతున్న తెలుగుదేశం పార్టీ, వైకాపా ఉపసంహరించుకుంటోంది అనే విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. తెలుగుదేశం నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ ను తిట్టి పోయడంలో కొంతైనా ఔచిత్యం పాటించకుంటే వాళ్లే నవ్వులపాలు అవుతారు అని ప్రజలు అనుకుంటున్నారు.