cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఎమ్మెల్యేలకు పోర్షే, జాగ్వార్ కార్లు!

ఎమ్మెల్యేలకు పోర్షే, జాగ్వార్ కార్లు!

కర్ణాటకలో కాంగ్రెస్ –జేడీఎస్ ల కూటమి ప్రభుత్వానికి ఝలక్ ఇస్తారన్న ఎమ్మెల్యేలను  కాంగ్రెస్ పార్టీ రాజీ చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి తీరు మీద అలకతో.. రాజీనామాకు వెనుకాడేది లేదన్నట్టుగా అజ్ఞాతంలోకి వెళ్లిన కొంతమంది ఎమ్మెల్యేలను చివరకు బతిమాలి కాంగ్రెస్ వాళ్లు తమవైపుకు తిప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి గండం గడిచి.. పిండం బయటపడే విధంగా కాంగ్రెస్ పార్టీ  వాళ్లు ఎమ్మెల్యేలతో రాజీ చేసుకున్నారని సమాచారం.

ఈ వ్యవహారంలో అలిగిన ఎమ్మెల్యేలకు భారీగా తాయిలాలు దక్కాయని తెలుస్తోంది. వారుకోరిన ఖరీదైన కార్లను కాంగ్రెస్ వాళ్లు సమకూర్చి పెట్టారట. ఈసారి కుమారస్వామి ప్రభుత్వాన్ని అక్కడ రక్షిస్తున్నది ఖరీదైన పోర్షే, జాగ్వర్ కార్లు అని టాక్. అలిగి అధిష్టానానికి అందుబాటులో లేకుండాపోయిన నేతలకు కాంగ్రెస్ వాళ్లు ఖరీదైన కార్లను ఇచ్చి సంతృప్తి పరిచినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ప్రత్యేకించి ముఖ్యమంత్రి కుమారస్వామి తీరుమీద కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నారు. సీఎం తమను పట్టించుకోవడం లేదు అని వారి ఫిర్యాదు. కనీసం కలవడానికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని కుమారస్వామి మీద వారు గుర్రుగా ఉన్నారట. ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు బీజేపీతో సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా సమాచారం.

ఎలాగూ పెద్ద మెజారిటీ లేదు. కాబట్టి.. బ్లాక్ మెయిల్ చేయడానికి వాళ్లకు అవకాశం లభించింది. దీంతో కుమారస్వామి ప్రభుత్వం పడిపోతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీ కూడా ఇండిపెండెంట్స్ ను తనవైపుకు తిప్పుకుంది. అయితే అలిగిన ఎమ్మెల్యేలకు ఖరీదైన తాయిళాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వారిని సంతృప్తి పరిచినట్టుగా తెలుస్తోంది.

అలిగినందుకు బహుమానంగా ఖరీదైన కార్లలో హైఎండ్ మోడల్స్ దక్కినందుకు ఎమ్మెల్యేలు కూడా తాము ఏదో పని మీద గోవాకు వెళ్లామని.. కాంగ్రెస్ కే తమ మద్దతు ఉంటుందని చెబుతున్నారట. ఇలా తగలడింది సంకీర్ణ రాజకీయం. సొంత పార్టీని ఎమ్మెల్యేలు బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఇలా తాయిళాలు పొందేందుకు అవకాశం ఏర్పడింది. ఈరోజు వీళ్లు.. రేపు మరో ముగ్గురు నలుగురు! 

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!