Advertisement

Advertisement


Home > Politics - Gossip

ట్రాక్ లోకి తెలుగు స్టేట్స్?

ట్రాక్ లోకి తెలుగు స్టేట్స్?

ఆలస్యం అయినా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలు కరోనా కట్టడికి కదిలినట్లే కనిపిస్తోంది. లాక్ డౌన్ మార్గం పట్టాయి. కరోనా నివారణ సంగతి అలా వుంచి చైన్ బ్రేక్ చేసి, వ్యాప్తిని కట్టడి చేసే ప్రయత్నం ప్రారంభించాయి. 

నిజానికి ఇది ఎప్పుడో చేయాల్సింది. కానీ ఆలస్యం అయిపోయింది. నిమ్మగడ్డ పుణ్యమా అని ఎన్నికలు అనివార్యం అయ్యాయి. కోర్టులు కూడా ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమనే విధంగా ముందుకు వెళ్లాయి. 

ఇప్పుడు అన్ని కోర్టులు ఎన్నికల కమిషన్ లను తప్పు పడుతున్నాయి కానీ నిమ్మగడ్డ టైమ్ లో ఎన్నికలకే మద్దతు ఇచ్చాయి. ఆపై చకచకా మున్సిపల్ ఎన్నికలు కూడా చేసేసారు. వ్యాక్సినేషన్ వుంది మహా ప్రభో అంటే వినలేదు. ఇప్పుడు వ్యాక్సినేషన్ పట్టించుకోవడం లేదు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఇలాంటి టైమ్ లో ఆలస్యమైనా మొత్తానికి జగన్ ప్రభుత్వం పని మొదలు పెట్టింది. అమరావతి నుంచి ఎవరూ కదలకుండానే ఆదేశాలు జారీ చేస్తున్నారు. అమయిలన మేరకు అమలు అవుతున్నాయి. 

మొత్తం మీద ఇప్పుడిప్పడే విలేజ్ ల్లో కూడా పోలీసులు కనిపిస్తున్నారు. జనాలను కట్టడి చేస్తున్నారు. ఇలా ఓ పది రోజులు సాగితే చైన్ తెగుతుందేమో చూడాలి.

ఇది ఓ అంకం మాత్రమే. సోకిన వారికి ట్రీట్మెంట్ సరిగ్గా అందేలా చూడాలి. ఆక్సిజన్ లు, బెడ్ లు, వ్యవహారాల సమస్యలు వుండనే వున్నాయి. ఆరోగ్యశ్రీ కి అనుమతులు దొరకడం లేదు అది కూడా సెట్ రైట్ కావాల్సి వుంది. అలా సెట్ రైట్ కావాలంటే వెంట వెంటనే బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తుందన్న నమ్మకం ఆసుపత్రులకు కలిగించాలి. 

ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఇక్కడ కూడా లాక్ డౌన్ విధించారు. ఇక్కడ కూడా చైన్ బ్రేక్ కు మార్గం కొంత ఏర్పడుతోంది. కోవిడ్ టెస్ట్ లు, ట్రేస్ , ట్రాక్ సిస్టమ్ పునరుద్దరించాల్సి వుంది. అలాగే ప్రభుత్వం తరపున కరోనా బెడ్ లు పెరగాల్సి వుంది.  

మొత్తం మీద ఇప్పటికైనా తెలుగు ప్రభుత్వాలు కరోనాపై కదలడం కాస్త ఆనందకరం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?