cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఈ ఫిరాయింపుతో తుమ్మలకు మంత్రిపదవి గ్యారెంటీనా!

ఈ ఫిరాయింపుతో తుమ్మలకు మంత్రిపదవి గ్యారెంటీనా!

తను ఎమ్మెల్యేగా తెరాస తరఫున కూడా నెగ్గలేకపోయినా.. ఖమ్మం జిల్లాలో నెగ్గిన టీడీపీ ఎమ్మెల్యేలను తెరాసలోకి తీసుకువెళ్లడం ద్వారా మంత్రి పదవిని పొందే ప్రయత్నంలో ఉన్నాడట తుమ్మల నాగేశ్వరరావు. ఏదో విధంగా తెరాసకు ఒక ఎమ్మెల్యే సంఖ్యను పెంచినట్టుగా అనిపించుకుని.. కేసీఆర్ కేబినెట్లో పదవి పొందాలనేది తుమ్మల ఎత్తుగడ అంటున్నారు.

ఇక కేసీఆర్ కేబినెట్ ఏర్పాటేమో వాయిదాల మీద వెళ్లిపోయింది. పంచాయతీ ఎన్నికలు అయిపోతే కానీ కేబినెట్ కూర్పు జరగకపోవచ్చు! ఇలాంటి నేపథ్యంలో తుమ్మల ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నట్టున్నాయి. అందుకే ఖమ్మంజిల్లా టీడీపీ ఎమ్మెల్యేమెచ్చా నాగేశ్వరరావును తెరాసలోకి చేర్చేందుకు తుమ్మల ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.

అందులో భాగంగా తాజాగా మెచ్చాతో తుమ్మల సమావేశం కూడా జరిపినట్టుగా సమాచారం. అయితే తను తెరాసలోకి చేరే ప్రసక్తి లేదని, తను తెలుగుదేశంలోనే ఉంటానని ఇదివరకే మెచ్చా ప్రకటించాడు. అయినా తుమ్మల మాత్రం తన ప్రయత్నాల్లో తాను ఉన్నట్టుగా ఉన్నాడు.

ఇక మరో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర మాత్రం తనకు మంత్రి పదవిని ఇస్తే తెరాసలోకి చేరడానికి సిద్ధమని బాహాటంగానే చెబుతున్నాడు.

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?

కేసీఆర్ ఫ్రంట్ ఇక అంతేనా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్