cloudfront

Advertisement


Home > Politics - Gossip

అక్కడ తేలిన ఆమంచి.. కథలో కొత్త మలుపులు!

అక్కడ తేలిన ఆమంచి.. కథలో కొత్త మలుపులు!

తెలుగుదేశం పార్టీని వీడనున్నారని వార్తల్లోకి వచ్చిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దగ్గర టీడీపీ బుజ్జగింపులు పని చేసిన దాఖలాలు కనిపించడం లేదు. పార్టీని వీడే విషయంలో అనుచవర్గంతో సమావేశం అయిన ఆమంచిని బుజ్జగించడానికి ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి శిద్ధా రాఘవరావు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. శిద్ధా బుజ్జగించారని.. ఆమంచి చల్లబడ్డారు అని.. చంద్రబాబును కలవడానికి వెళ్తున్నారని తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం చేసింది. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆమంచి చంద్రబాబును కలవబోతున్నారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది.

అయితే ఆమంచి మాత్రం రామచంద్రాపురంలో తేలారు! ఉన్నట్టుండి రూటు మార్చి అటువెళ్లారు. అక్కడ మరో టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులతో ఆమంచి సమావేశం కావడం ఆసక్తిదాయకంగా మారింది. తోట త్రిమూర్తులు కూడా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిడిగా ఉన్నారు. ఆయన కూడా తెలుగుదేశాన్ని వీడతారనే ప్రచారం ఉంది. ఇలాంటి నేఫథ్యంలో ఆమంచి వెళ్లి తోట త్రిమూర్తులతో సమావేశం కావడం ఈ కథలో అసలైన ట్విస్టుగా మారింది. 

అక్కడ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలూ పలువురు కాపు సామాజికవర్గం నేతలతో సమావేశం అయ్యారట. మరి ఏం డిసైడ్ అయ్యారో చూడాల్సి ఉంది. మరోవైపు ఆమంచి ముఖ్యమంత్రిని కలవబోతున్నారని.. టీడీపీ అనుకూల మీడియా గట్టిగా ప్రచారం చేస్తోంది. ముందుగా పెట్టిన ముహూర్తం క్యాన్సిల్ కావడంతో.. తెలుగుదేశం అనుకూల మీడియా.. అదుగో వస్తున్నారు ఆమంచి చంద్రబాబును కలవడానికి అని ప్రచారం చేస్తోంది. మరి ఈ కథ ఇకపై ఎటు టర్న్ అవుతుందో చూడాల్సి ఉంది,

కీలకమైన 'పోల్‌ మేనేజిమెంట్‌' జగన్ ఎదుర్కోగలడా?